రఘురామ కృష్ఱంరాజుకు బిగ్ షాక్..టీడీపీలో చేరిన ఫలితం లేదే..!
టీడీపీ కంచుకోటల్లో ఉండి నియోజకవర్గం కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఉండి నియోజకవర్గం నుంచి రామరాజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ దఫా కూడా రామరాజునే పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. టికెట్ దక్కడంతో ప్రచారం నిర్వహిస్తోన్న రామరాజుకు పార్టీ అధినేత గట్టి ఝలక్ ఇచ్చారు.
వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ఱంరాజును పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పేరునే ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉండి టికెట్‌పై ఇప్పటికే రఘురామ కృష్ఱంరాజుకు చంద్రబాబు హామీ ఇచ్చారని..ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రామరాజుకు సైతం తెలియజేశారని తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.

దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే రామరాజు 2019లో తాను ఇక్కడ్నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామరాజు కోసం తనని బలిచేయడం కరెక్ట్ కాదంటున్నారాయన. ఇదిలా ఉంటే రఘురామ కృష్ఱంరాజుకు టికెట్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న రామరాజును కాదని..ఇటీవల పార్టీలో చేరిన రఘురామ కృష్ఱంరాజుకు ఉండి సీటు ఎలా ఇస్తారని కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలతో రామరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
టికెట్ ఇచ్చినట్టే తిరిగి వేరే వారికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించులేకపోతున్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీరు కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్దమైన తరుణంలో ఎమ్మెల్యే రామరాజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఉండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.
టీడీపీ టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పోటీ చేయడం ఖాయమని అని ఆయన కార్యకర్తలకు, అనుచరులకు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారని స్పష్టం చేశారని తెలుస్తోంది. రామరాజు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తే అది టీడీపీపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉండి టీడీపీలో రెండు వర్గాలు ఉండగా, వారిని కాదని రఘురామరాజు సీటు కేటాయిస్తే ఇక్కడ టీడీపీ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications