వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో భారీగా రేషన్ కార్డులు, పింఛన్ల కోత.. సీఎం జగన్ 9 నెలల పాలపై టీడీపీ రిపోర్టు

|
Google Oneindia TeluguNews

ఏపీలో భారీ సంఖ్యలో రేషన్ కార్డులు, పింఛన్లపై కోతలు విధిస్తున్నారని, తన తొమ్మిది నెలల పాలనలో సీఎం జగన్ సుమారు లక్ష కోట్ల విలువైన సంక్షేమ పథకాలకు పాతరేశారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. గడిచిన తొమ్మిది నెలల్లో ఏకంగా 18.72 లక్షల రేషన్ కార్డులు, 7 లక్షల మందికి పింఛన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ తెలిపంది. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లతో అధికార పక్షంపై విమర్శలదాడి చేసింది.

కోతలు ఇలా..

కోతలు ఇలా..


లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం కోసేయడం, పాత సంక్షేమ పథకాలను రద్దుచేయడం, హామీల పై మాట తప్పడం ద్వారా సీఎం జగన్ గడిచిన తొమ్మిది నెలల్లో రైతులకు దక్కాల్సిన 40వేల కోట్లు మిగుల్చుకున్నారని, అన్ని పథకాలు కలిపితే ఈ సంఖ్య లక్ష కోట్లు దాటుతుందని టీడీపీ వివరించింది.

భజన.. బకాయిలు..

భజన.. బకాయిలు..

వైసీపీ నేతలు ప్రెస్ మీట్లలో సీఎం జగన్ గురించి భజన చేయడం, ఏపీ ప్రజలందరూ సుఖాలలో మునిగి తేలుతున్నట్టు బడాయి మాటలు చెబుతూ టైమ్ పాస్ చేస్తున్నారని, గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం జనం వైసీపీని, సీఎం జగన్ ను తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారని, ఎక్కడికక్కడ ప్రభుత్వం బకాయిలు పడి ఉందని ఆరోపించింది.

ఏపీ పరువుతీశారు..

ఏపీ పరువుతీశారు..

విశాఖ మెడ్‌టెక్‌ సిటీలో పనులు చేసిన టీయూవీ రీయిన్‌లాండ్‌ సంస్థకు రూ.29.41 కోట్లను చెల్లించక పోవడంతో వైసీపీ ప్రభుత్వంపై జర్మనీ రాయబారి కేంద్రానికి ఫిర్యాదు చేశారని, తద్వారా సీఎం జగన్ ఏపీ పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చుతున్నారని టీడపీ మండిపడింది. పోలవరం పనులు చేసిన బావర్‌ కంపెనీకి కూడా రూ.91.10కోట్లు బకాయిలు ఉన్నారని గుర్తుచేసింది.

విద్యానిధికి నిధులేవి?

విద్యానిధికి నిధులేవి?

అంబేద్కర్‌ ఓవర్సీర్‌ విద్యానిధి, ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకాల ద్వారా గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు వర్గాల విద్యార్థులకు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేస్తే, ఆ పథకానికి పేరు మార్చిన జగన్.. తొమ్మిది నెలల్లో ఒక్క పైసా ఇవ్వలేదని టీడీపీ విమర్శించింది.

English summary
tdp alleged that ysrcp govt has cut about 18.72 lack ration cards and 7 lack pensioners in last nine months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X