పవన్ కల్యాణ్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నాల్లో చంద్రబాబు..?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన 21లుగాను 21 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో కూటమి గెలుపులో జనసేన ప్రధాన పాత్ర పోషించింది. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం జనసేనకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదనే వాదన తెర మీదకు వస్తోంది. పెన్షన్‌ను రూ.4000 పెంచుతూ కూటమి నిర్ణయం తీసుకుంది.
అయితే 1వ తేదీన కేవలం టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రమే పెన్షన్లను పంచుతు కనిపించారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు అందించిన కరపత్రాలలో పవన్ ఫోటో లేదని , ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రకటనల్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొందరైతే బహిరంగంగానే టీడీపీ నేతల తీరుపై విమర్శలు చేశారు. జనసేన లేకపోతే కూటమి గెలుపు లేదని జనసేన మహిళా కార్యకర్త చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన మరువక ముందే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

ఆయన ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. దీనిపై కూడా జనసేన కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసైనికులు పవన్‌కు టీడీపీ అప్పుడే ప్రాధాన్యం తగ్గించడం మొదలు పెట్టిందని, అప్పుడే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పెడుతున్న పోస్టింగ్స్ చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు తన వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తీసుకువెళ్లకపోవడంతో ఇప్పుడు జనసేనలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్‌ను కూడా చంద్రబాబు వెంట తీసుకువెళ్తే మరింత బలంగా ఉండేదని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో తెలంగాణ తెలంగాణ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు .ప్రధాన ని కలిసినా, కేంద్ర మంత్రులతో భేటీ అయినా , రేవంత్ రెడ్డి వెంట భట్టి విక్రమార్క కూడా ఉంటున్నారు.కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను తీసుకు వెళ్లకుండా, మిగతా మంత్రులను తీసుకువెళ్లడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు పవన్ తీసుకువెళ్లకుండా ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం మొదలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications