పేకాటాంధ్రప్రదేశ్‌గా ఏపీ: రాష్ట్ర క్రీడగా: ఒలింపిక్స్‌లో పేకాట ప్రపోజల్స్: కళా వెంకట్రావ్
అమరావతి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని పేకాట స్థావరాలపై పోలీసులు జరిపిన మెరుపు దాడిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రోద్బలంతోనే ఈ పేకాట స్థావరం నడుస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పేకాటాంధ్రప్రదేశ్‌గా మార్చిందని విమర్శించారు. జూదాన్ని రాష్ట్ర క్రీడగా గుర్తించే స్థితికి దిగజారిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
చట్టానికి లోబడి వ్యవహరిస్తామంటూ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతున్నారని మండిపడ్డారు. పేకాట శిబిరాల నిర్వహణకు నైతిక భాధ్యత వహిస్తూ మంత్రి జయరాం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ మంత్రులు, నేతలు పేకాట క్లబ్బులు, గుండాట శిబిరాలు నిర్వహిస్తున్నారని, జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని ఆరోపించారు. పేకాటను ఒలంపిక్స్ లో చేర్చాలని వైసీపీ నేతలు ప్రతిపాదనలు పంపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు.

మంత్రి అనుచరులు, వైసీపీ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడుటమే కాకుండా తమను పట్టుకున్న పోలీసులపై దాడి చేయటం హేయమైన చర్య అని కళా వెంకట్రావ్ మండిపడ్డారు. మంత్రి స్వగ్రామం అంటే సంక్షేమం, అభివృద్ది లో ముందు వరుసలో నిలిపి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని, అలాంటిది పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను, ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా లూటీ చేయటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు.
మంత్రి ప్రోద్బలంతోనే ఆయన సోదరుడు, చిప్పగిరి వైసీపీ మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, మంత్రి తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. మంత్రిపై ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదని, మంత్రిని మందలించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పులివెందులలో కూడా పార్టీ నేతలు యథేచ్ఛగా పేకాట క్లబ్బులను నిర్వహిస్తున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.
Recommended Video
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications