రాబిన్ శర్మకు కలిసొచ్చిన "ఈశాన్యం" - టీడీపీలో మొదలైన కొత్త లెక్కలు..!!
టీడీపీకి వ్యూహకర్తగా సేవలందిస్తున్న రాబిన్ శర్మ పైన పార్టీలో అంచనాలు పెరుగుతున్నాయి.
వచ్చే ఎన్నికలకు టీడీపీ సిద్దమవుతోంది. జనసేనతో పొత్తు..స్ట్రాటజిస్టుల వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. పొత్తులపై అధికారిక నిర్ణయం తరువాత ఇతర నియోజకవర్గాలపైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు జిల్లాల పర్యటనలు..లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పార్టీ రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహాలు..ప్రచారం పైన పార్టీకి సలహాలు ఇస్తున్నారు. రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేసారు. ఇప్పుడు టీడీపీ కోసం పని చేస్తూనే..ఆయన తాజాగా ఈశాన్యం లో తన వ్యూహాలతో వార్తల్లో నిలిచారు. మేఘాలయాలో రాబిన్ టీం పని చేసిన ఎన్‌పీపీకి అధికారం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. ఇప్పుడు ఇది టీడీపీలో కొత్త చర్చకు కారణమవుతోంది.

టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహాలు
ఇప్పుడు ఏపీలో రెండు ప్రధాన పార్టీలు వైసీపీ..టీడీపీకి వ్యూహకర్తలు తెర వెనుక సేవలు అందిస్తున్నారు. ఇద్దరూ గతంలో ఐప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ తో పాటుగా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ వీడిన తరువాత ఇద్దరూ తమ టీంలతో వేర్వేరుగా పార్టీలతో ఒప్పందాలు చేసుకొని ఆ పార్టీల గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. గత ఏడాదికి పైగా రాబిన్ శర్మ టీం ఏపీలో టీడీపీ కోసం పని చేస్తోంది. కొంత కాలం క్రితం జరిగిన పార్టీ కీలక సమావేశంలోనూ రాబిన్ శర్మ ఇదేం ఖర్మ..కార్యక్రమ నిర్వహణ పైన పార్టీ నేతలకు సూచనలు చేసారు. ఇప్పుడు వైసీపీ నిర్ణయాలు..నినాదాలకు కౌంటర్ గా టీడీపీ ఎన్నికల బరిలోకి దిగేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.

మేఘాలయలో సక్సెస్ అయిన రాబిన్ టీం
ఇదే సమయంలో తాజాగా ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో జరిగిన ఎన్నికల్లో ఎన్‌పీపీ విజయం కోసం రాబిన్ శర్మ టీం పని చేసింది. క్షేత్ర స్థాయి నుంచి పోలింగ్ జరిగే వరకూ అన్ని బాధ్యతలు ఈ టీం పర్యవేక్షించింది. మేఘాలయలో 60 సీట్లకు పోలింగ్ జరిగింది. అందులో ఎన్‌పీపీకి 18-24 సీట్ల వరకు వస్తాయని..ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. అదే సమయంలో ప్రధానంగా పోటీ దారుగా నిలిచిన టీఎంసీకి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ పనిచేసింది. షో టైమ్ కన్సల్టింగ్ పేరుతో అక్కడ రాబిన్ శర్మ టీం ఎన్‌పీపీ గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేసింది. మేఘాలయో ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశాలు..ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్లపైన పని చేసే అస్త్రాల పైన రాబిన్ శర్మ టీం ఫోకస్ చేసింది. మేఘాలయలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్పీపీ పార్టీల కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకోగా, ఈ సారి ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి.












Click it and Unblock the Notifications