బిగ్‌బాస్‌లో 'శివాజీ' గరుడ పురాణం.. టీడీపీ అండగా నిలిచేనా..?

బిగ్‌బాస్‌ 7వ సీజన్ గత ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా ఫేమస్ ఆర్టిస్ట్‌లను తీసుకురావడంలో బిగ్‌బాస్‌ యాజమాన్యం మరొసారి ఫెయిల్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు ఎవరూ కూడా ఈ సీజన్‌లో కనిపించడం లేదు.

టీవీ సీరియల్స్ వారు కొందరైతే.. సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు మరికొందరు. సినిమా ఇండస్ట్రీ నుంచి షకీల, శివాజీలు మాత్రమే హౌస్‌లో కనిపిస్తున్నారు. నటుడు శివాజీ బిగ్‌బాస్‌ హౌస్‌లో కనిపించి ఒకింత అందరికి షాకిచ్చారనే చెప్పాలి. ఆయన బిగ్‌బాస్‌‌కు వస్తారని ఎవరూ కూడా ఊహించలేదు.కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుండగానే శివాజీకి హీరోగా అవకాశాలు దక్కాయి.

garuda sivaji

శివాజీ నటించిన కాలేజ్, అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ, శివరామరాజు వంటి సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి.తరువాత వచ్చిన యంగ్ హీరోల ముందు శివాజీ నిలబడలేకపోయారు. అరకొర సినిమాల్లో నటించడే తప్ప.. ఆయనకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇదే సమయంలో శివాజీ రాజకీయ నాయకుడుగా అవతారం ఎత్తారు.

మొదట్లో తటస్థంగా ఉండి.. చంద్రబాబు పాలనపై విమర్శలు చేసిన శివాజీ.. అనుహ్యంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. పోలవరం, రాజధాని నిర్మించడం చంద్రబాబు వల్లే అవుతుందని..ఆయన్ను ఒక్కసారి ఆకాశానికి ఎత్తేశారు. 2019 ఎన్నికల ముందు గరుడ పురాణం అని ఓ కథను ప్రజలకు వివరించారు.శివాజీ టీడీపీకి అండగా నిలిచినప్పటికీ ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.

garuda sivaji

తరువాత కూడా పలు ఇంటర్య్వూల్లో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శివాజీ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచి వినిపిస్తుంది. ఒకవేళ టికెట్ దక్కకపోయినా.. నామినేటెడ్ పదవి అయిన శివాజీకి కచ్చింతంగా దక్కుతుందని టీడీపీ వర్గాలు భావించాయి.కాని శివాజీ ఎవరు ఊహించన విధంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చారు.

garuda sivaji

అసలు శివాజీ బిగ్‌బాస్‌‌కు ఎందుకు వెళ్లారా అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసమే శివాజీ బిగ్‌బాస్‌‌లోకి వెళ్లారని కొందరు కామెంట్స్ చేస్తుంటే..అక్కడ ఏ గరుడ పురాణం గురించి వివరించడానికి వెళ్లారో అని మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. శివాజీకి బయట పాపులారిటీ బాగానే ఉంది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు ఆయనకు అండగా నిలిస్తే.. బిగ్‌బాస్‌ టాప్ 5లో శివాజీ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. కష్టకాలంలో టీడీపీకి అండగా నిలిచిన శివాజీకి .. ఇప్పుడు టీడీపీ అండగా ఉంటుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+