YSRCP: వైసీపీ ఎమ్మెల్యే దాడిపై టిక్‌టాక్ వీడియో: అసభ్యకరంగా: టీడీపీ కార్యకర్త అరెస్ట్..!

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై టిక్‌టాక్‌లో వీడియో తీసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా మాచర్లకు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై ఇటీవలే గుంటూరు జిల్లా చినకాకాని వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఆ కార్యకర్త ఈ టిక్‌టాక్ వీడియోను చిత్రీకరించినట్లు చెబుతున్నారు.

ఆయన పేరుఅవినాష్ చౌదరి ధూలిపాళ్ల. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అవినాష్.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా పనిచేశారని అంటున్నారు.

TDP Supporter arrest for made a Tik Tok video on YSRCP MLA, Whip Pinnelli Ramakrishna Reddy

ఓ మాజీమంత్రి కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, రోడ్‌షోలల్లో పాల్గొన్నారని సమాచారం. రాజకీయపరమైన టిక్‌టాక్ వీడియోలను చిత్రీకరించడం అతని అలవాటని, ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రత్యర్థులు చేసిన విమర్శలకు టిక్‌టాక్ వీడియోల ద్వారానే సమాధానమిచ్చేవాడని తెలుస్తోంది.

TDP Supporter arrest for made a Tik Tok video on YSRCP MLA, Whip Pinnelli Ramakrishna Reddy

పిన్నెల్లి కారుపై దాడి ఘటన చోటు చేసుకున్న వెంటనే అవినాష్.. తన అలవాటు ప్రకారం.. దానిపైనా టిక్‌టాక్ వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పిన్నెల్లిపై అసభ్య పదజాలాన్ని వినియోగించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుచరులు జిల్లాలోని వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అవినాష్ కోసం అన్వేషించారు. అతను హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో ఓ బృందాన్ని అక్కడికి పంపించి, బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మాచర్లకు తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+