శ్రీవారి చెంత సతీమణి, కుమారులతో బాబు (పిక్చర్స్)
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, పార్టీ నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆయన శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు టిటిడి చైర్మన్ కె. బాపిరాజు, టిటిడి ఇవో ఎంజి గోపాల్, జెఇవో కెఎస్ శ్రీనివాస రాజు తదితరులు స్వాగతం పలికారు. వేంకటేశ్వర స్వామివారిని అలంకరించిన ఆభరణాలు, క్షేత్ర మహత్మ్యం విశేషాలను తిరుమల ప్రధాన పూజారి డాక్టర్ ఎవి రమణ చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబుకు రంగనాయకులు మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. బాపిరాజు, తదితరులు ఆయనకు ప్రసాదాన్ని, శ్రీవారి లామినేషన్ చిత్రాన్ని అందించారు.
రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి తన శక్తిని ప్రసాదించాలని తాను శ్రీవారిని కోరినట్లు ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
తిరుమల శ్రీవారి ఆలయం ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
శ్రీవారి ఆలయం లోపల చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌లతో కలిసి ఇలా కనిపించారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
శ్రీవారి ఆలయంలో తెలుగుేదశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొబ్బరి కాయలను కొడుతూ ఇలా కనిపించారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పెద్ద జీయర్ ఆశీర్వచనం తీసుకున్నారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
తిరుమల శ్రీవారి ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు. ఆయన సోమవారంనాడు శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లో చంద్రబాబు ఇలా కనిపించారున. ఆయన వెనక భువనేశ్వరి ఉన్నారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం శ్రీవారి లామినేటెడ్ ఫొటోను స్వీకరిస్తూ చంద్రబాబు ఇలా కనిపించారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు
తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్.












Click it and Unblock the Notifications