జెసి ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు, పార్టీ నుండి కౌన్సిలర్ సస్పెన్షన్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిఫల్ కౌన్సిలర్ జయచంద్రారెడ్డిని టిడిపి నుండి సస్పెన్షన్ వేటేసింది. మూడు మాసాల పాటు ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు.
అనంతపురం:అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిఫల్ కౌన్సిలర్ జయచంద్రారెడ్డిని టిడిపి నుండి సస్పెన్షన్ వేటేసింది. మూడు మాసాల పాటు ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో జెసీ ప్రభాకర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఇటీవల జయచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై జేసీకి క్షమాపణలు చెప్పాలని పార్టీ ఆదేశించింది. దీన్ని ఆయన పట్టించుకోలేదు.

అంతేకాదు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాని ఆయన ప్రకటించారు. దీంతో టీడీపీ నాయకత్వం ఆయనపై చర్యలను తీసుకొంది. మూడుమాసాలపాటు జయచంద్రారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకొంది.












Click it and Unblock the Notifications