వైసీపీ గృహసారధులకు టీడీపీ కౌంటర్- 30 కుటుంబాలకో సాధికార సారధి-చంద్రబాబు ప్రకటన

వచ్చే ఎన్నికల్లో జనానికి చేరువయ్యేందుకు వైసీపీ ప్రారంభించిన గృహసారధుల వ్యవస్ధకు కౌంటర్ గా టీడీపీ సాధికార సారధుల వ్యవస్ధను తీసుకొస్తోంది.

ఏపీలో వచ్చే ఎన్నికల పోరు ఎంత తీవ్రంగా ఉండబోతోందో ఇప్పటికే తేలిపోయింది. ఎత్తుకు పై ఎత్తులతో అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రారంభించిన గృహసారధుల వ్యవస్ధకు దీటుగా మరో వ్యవస్ధను ప్రారంభించబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా టూర్ లో ఉన్న చంద్రబాబు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

టీడీపీ సాధికార సారధులు

టీడీపీ సాధికార సారధులు


ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాన్ని చేరువయ్యేందుకు విపక్ష టీడీపీ కొత్త వ్యవస్ధల్ని సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా సాధికార సారధుల పేరుతో కొత్త వ్యవస్ధకు రూపకల్పన చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల భేటీలో ప్రకటించారు.
పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ ఛార్జ్ లను కుటుంబ సాధికార సారధులుగా పిలవబోతున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా కార్యకర్తలకు వెల్లడించారు.

ప్రతీ 30 కుటుంబాలకో సారధి

ప్రతీ 30 కుటుంబాలకో సారధి

ఇవాళ జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లడారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పని చేసిన వారికి అనుకున్న స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయామని ఆయన తెలిపారు. ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు బాబు వెల్లడించారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారధులుగా పిలుస్తామన్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారధి ఉంటారని, ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారధి విభాగం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుందన్నారు.

వైసీపీ గృహసారధులకు పోటీగా ?

వైసీపీ గృహసారధులకు పోటీగా ?

వైసీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది గృహసారధుల్ని నియమిస్తోంది. ఈ మేరకు నియామక ప్రక్రియను ప్రారంభించిన వైసీపీ.. దాదాపు అన్ని నియోజకవర్గాల్ని కవర్ చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ 50 ఇళ్లకొక వాలంటీర్ ఉండగా.. వీరికి అదనంగా ఇద్దరు గృహసారధుల్ని నియమిస్తోంది. వీరిపై పర్యవేక్షణ కోసం సచివాలయ కన్వీనర్లను సైతం నియమిస్తోంది. దీంతో టీడీపీ కూడా కుటుంబ సాధికార సారధుల పేరుతో నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేయబోతున్నామో సదరు కుటుంబాలకు వివరించబోతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+