తెలుగుదేశం పార్టీలో ఆ 'సీనియ‌ర్ నేత‌'ను దాదాపుగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్లే?

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత‌గా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కొనసాగుతున్నారు. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించేవారు. 1984 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఓట‌మిపాల‌య్యారు. త‌ర్వాత ఎమ్మెల్సీ అవ‌డంతో ఆయ‌న సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు బరిలోకి దిగి 2014, 2019 ఎన్నిక‌ల్లో వరుసగా ఓట‌మిపాల‌య్యారు. వ‌రుస‌గా మూడుసార్లు ఓట‌మిపాలైన‌వారికి తర్వాత ఎన్నిక‌ల్లో సీటు ఉండ‌వని మ‌హానాడులో టీడీపీ నేత నారా లోకేష్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు కూడా వ‌ర్తిస్తుంద‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాకినాడ రూరల్ నుంచి కుమార్తెను బరిలోకి దింపాలని..

కాకినాడ రూరల్ నుంచి కుమార్తెను బరిలోకి దింపాలని..


య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఈసారి ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెను కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయించే యోచ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టినుంచే ఆయ‌న అందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఈ ప్ర‌తిపాద‌న లోకేష్ ముందు పెట్ట‌గా దీనికి ఆయ‌న నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడివ‌ల్లే ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, గ్రూపు రాజ‌కీయాలేర్ప‌డ్డాయ‌ని అధిష్టానం గ‌ట్టిగా న‌మ్ముతోంది. ఆ ప్ర‌భావం రానున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై ప‌డ‌బోతోంది. దాదాపుగా ఆయ‌న కుటుంబం నుంచి ఈసారి సీటుండ‌ద‌నే భావిస్తున్నారు.

నిమ్మకాయల చినరాజప్ప ఫిర్యాదు చేయడంతో..

నిమ్మకాయల చినరాజప్ప ఫిర్యాదు చేయడంతో..


అంతేకాకుండా పార్టీకి మొద‌టి నుంచి ఆ జిల్లాలో అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప కూడా య‌న‌మ‌ల‌పై ప‌లుమార్లు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌వ‌ల్ల జిల్లావ్యాప్తంగా పార్టీకి తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌న్న అభిప్రాయం అంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో తుని ఒక్కటే కాకుండా ఎక్క‌డా ఆ కుటుంబానికి సీటివ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ఆయ‌న‌కు తెలియ‌జేశార‌ని, ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

గ్రూపులను పెంచి పోషిస్తున్న యనమల?

గ్రూపులను పెంచి పోషిస్తున్న యనమల?


జిల్లాలో గ్రూపుల‌ను పెంచి పోషించ‌డంవ‌ల్లే పార్టీకి తీవ్ర‌న‌ష్టం క‌లుగుతోంద‌ని భావించ‌డంతోపాటు బీసీ వ‌ర్గాల్లో చాలామంది నేత‌లు టీడీపీలో ఉన్నార‌ని, బీసీ నేత‌గా కూడా పార్టీకి ఆయ‌న ఉప‌యోగ‌ప‌డంలేద‌ని భావిస్తున్న‌ట్లు సమాచారం. సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న‌కు చంద్ర‌బాబు ప్రాతినిధ్యం క‌ల్పిస్తున్నప్ప‌టికీ లోకేష్ స‌సేమిరా అంటున్నార‌ని, దీంతో దాదాపుగా య‌న‌మ‌ల కుటుంబం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి వైదొలిగిన‌ట్లేన‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే తునిలో కొత్త వ్య‌క్తి కోసం అన్వేష‌ణ ప్రారంభ‌మైన‌ట్లు పార్టీవ‌ర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+