హామీలపై పోరాటమేం: ఎర్రబెల్లి, జాతకం చెప్పరాదని

హైదరాబాద్: ఎన్నికల హామీలు అన్నింటిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిలబెట్టుకోవాలని, లేదంటే ఆ హామీలు అన్నీ నెరవేర్చే వరకు తాము పోరాటం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం అన్నారు.

కేంద్రంపై యుద్ధమే: కేసీఆర్

హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం అంటే రాష్ట్ర హక్కులను కేంద్రం లాక్కోవడమేనని కేసీఆర్ బుధవారం నాటి విలేకరుల సమావేశంలో అన్నారు. కేంద్రం వెంటనే ఈ చర్యలకు స్వస్తి పలకాలన్నారు. కాదని ముందుకెళ్తే కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామన్నారు.

TDP will fight to the last: Errabelli

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలుపుతామని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, పెంపుదలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేశామని ఆయన తెలిపారు.

జాతకం చెప్పరాదన్న కేసీఆర్

మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తే తనకు జాతకం చెప్పడం రాదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందంటూ పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో విలేకరులు విస్తరణపై అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+