గజ్వెల్ మున్సిపల్ రసవత్తరం: కెసిఆర్ గెలిస్తే పోటాపోటీ

మెదక్: మెదక్ జిల్లా గజ్వెల్ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక విషయం రసవత్తరంగా మారింది. గజ్వెల్ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. 10 వార్డులలో తెలుగుదేశం, 9 వార్డులలో తెలంగాణ రాష్ట్ర సమితి, 1 వార్డులో కాంగ్రెసు పార్టీ గెలుపొందాయి. దీంతో గజ్వెల్ నగర పంచాయతీ చైర్మన్ పదవి కోసం టిడిపి, తెరాసల మధ్య పోటా పోటీ నెలకొంది.

టిడిపి చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే మరో కౌన్సిలర్ కావాల్సి ఉంటుంది. తెరాసకు దక్కాలంటే ఇద్దరు కావాలి. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుడి ఓటు కీలకం కానుంది.

TDP win in 10 wards in Gajwel

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు హక్కు లభించే ఎమ్మెల్యే ఓటు గజ్వెల్ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారనుంది.

గజ్వెల్ నుండి కెసిఆర్ గెలిస్తే తెరాస బలం 10కి చేరుతుంది. అప్పుడు మరో సభ్యుడు అవసరం అవుతుంది. కాంగ్రెసు తరఫున గెలుపొందిన కౌన్సిలర్ మద్దతు ఇస్తే చైర్మన్ పదవి తెరాసకు దక్కుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి తటస్థంగా వ్యవహరిస్తే లాటరీ ద్వారా చైర్మన్ ఎంపిక జరగనుంది. కెసిఆర్ కాకుండా టిడిపి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గెలిస్తే చైర్మన్ పదవి సైకిల్‌ను వరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+