ఖమ్మంలో టిడిపి దూకుడు, నల్గొండలో తెరాసతో ఢీ
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెసు, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ దూసుకు పోతోంది. టిడిపి తెలంగాణలో కూడా పరువు నిలబెట్టుకుంటోంది. విభజన నేపథ్యంలో తెలంగాణలో టిడిపి పూర్తిగా కనుమరుగు అవుతుందని అందరు భావించారు. కానీ తెలంగాణలోను సైకిల్ ఆశించిన దాని కంటే మించి ఫలితాలు సాధించిందనే చెప్పవచ్చు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కాంగ్రెసు, తెరాసల కంటే వెనుక బడి ఉంది. కానీ ఖమ్మంలో మాత్రం ఆ రెండింటి కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటోంది. సాయంత్రం ఏడు గంటల వరకు వచ్చిన ఫలితాల మేరకు... ఖమ్మం జిల్లాలో టిడిపి 160 ఎంపీటీసీలను, 1 జెడ్పీటీసీని గెలుచుకుంది. కాంగ్రెసు పార్టీ 52 ఎంపీటీసులను, 2 జెడ్పీటీసీలను గెలుచుకోగా, తెరాస 1 స్థానానికే పరిమితమైంది.

అదిలాబాదులో 51, కరీంనగర్‌లో 25, వరంగల్‌లో 31, నిజామాబాదులో 19, మెదక్‌లో 35, రంగారెడ్డిలో 68, మహబూబ్ నగర్‌లో 70 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నల్గొండలో 69 స్థానాలతో తెరాస(67)కు గట్టి పోటీనిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ 1324 ఎంపీటీసీలు, 47 జెడ్పీటీసులు, తెరాస 1094 ఎంపీటీసీలు, 98 జెడ్పీటీసీలు గెలుచుకోగా టిడిపి 588 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసులను గెలుచుకుంది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications