బాలయ్య దెబ్బ- వైసీపీ అబ్బా: బావను మించిన రాజకీయం
Nandamuri Balakrishna: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పారు. రాజకీయాల్లో బావ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మించిపోయానని నిరూపించుకోగలిగారు.
మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక బాలయ్య రాజకీయానికి అద్దం పట్టింది. అత్యంత పోటాపోటీ పరిస్థితుల మధ్య హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ కుర్చీని దక్కించుకోగలిగారాయన. ఈ కుర్చీని ఇప్పుడిక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన రమేష్.. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో బాలకృష్ణ అక్కడే మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్యాంప్ రాజకీయాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. మెజారిటీ తగ్గకుండా జాగ్రత్త పడగలిగారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కౌన్సిలర్లు మళ్లీ సొంత గూటికి చేరుకోనివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లల్లో ఖాళీగా ఉన్న ఛైర్మన్లు, చైర్ పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నేడు జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు మేయర్లు, నందిగామ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల కోసం ఎన్నిక సాగుతోంది.
ఇందులో భాగంగా కొద్దిసేపటి కిందటే హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో హిందూపురం ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఇంద్రజ పార్టీ ఫిరాయించారు. గత ఏడాది ఆగస్టులో ఆమె వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు. మొత్తం ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లూ ఆమె వెంట టీడీపీలో చేరారు. ఫలితంగా- ఛైర్‌పర్సన్ ఎంపిక అనివార్యమైంది.
చేరికలతో కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలం 23. వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 17కు పడిపోయింది. దీనితో- ఊహించినట్టే ఛైర్మన్ కుర్చీ పోరులో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. కౌన్సిల్ హాలులో జరిగిన ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని లక్ష్మీకి 14 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.
ఈ ఎన్నిక నేపథ్యంలో హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీలు క్యాంపులను నిర్వహించారు. ఆయా క్యాంపుల నుంచి వాళ్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఓటింగ్‌లో పాల్గొన్నారు. చేతులు ఎత్తి టీడీపీకి 23 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications