వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమలో రైతు కోసం తెలుగుదేశం ; జగన్ పాలన రైతు దగా పాలన అంటూ టీడీపీ ధ్వజం, డిమాండ్లు ఇవే !!

|
Google Oneindia TeluguNews

రైతు కోసం తెలుగుదేశం అంటూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతు సమస్యలపై పోరాటం ఈరోజు కోనసీమ ప్రాంతంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రైతు సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కోనసీమ ప్రాంతంలోని రైతన్నలు టీడీపీ ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. కోనసీమ ప్రాంతంలో రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టి వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు.

నిన్న రాయలసీమలో .. నేడు కోనసీమలో రైతు కోసం తెలుగుదేశం

నిన్నటికి నిన్న రాయలసీమ వ్యాప్తంగా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి రాయలసీమ రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోనసీమలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించిన ఆందోళనలో రెండవ రోజు కోనసీమ ప్రాంతంలో టిడిపి నేతలు, రైతులు పెద్ద ఎత్తున విభిన్న రూపాల్లో నిరసనలు చేపట్టారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏంటో చెప్పాలని, ఇప్పటివరకు రైతు సంక్షేమానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలని, వ్యవసాయ పనిముట్లు, యంత్ర సామాగ్రి కొనుగోలుకు ఏ మేరకు రైతులకు సహాయం చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు పొలంలో ఉచిత బోర్లు వేస్తానని చెప్పిన సర్కార్ ఇప్పటివరకు ఎక్కడ ఉచిత బోర్లు వేశారు చూపించాలని నిలదీస్తున్నారు.

YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శYS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ

కోనసీమ రైతుల డిమాండ్లు ఇవే

రైతు కోసం తెలుగుదేశం ... నేను సైతం రైతు కోసం అంటూ కోనసీమ ప్రాంత రైతుల కోసం కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కారు తీరు పై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, కోనసీమ రైతుల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి త్వరితగతిన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక కోనసీమ ప్రాంతంలో రైతుల సమస్యల విషయానికి వస్తే పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు అన్నీ వెంటనే పూర్తి చేయాలని కోనసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట కొనుగోలు బకాయిలను వెంటనే చెల్లించాలని, రైతులందరికీ పంటల బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఉద్యాన పంటలకు కనీస ధరను ప్రకటించి అమలు చేయాలని కోరుతున్నారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని, నక్కల కాలువ, ఇరుముడి డ్రెయిన్ల ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని, వరుస, తుపాన్లు వరదల నష్టాల్లో ఉన్న కోనసీమ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కోనసీమలో పెద్ద ఎత్తున ఆందోళనలు

ఈ రోజు కోనసీమలో రైతు కోసం తెలుగుదేశం ఆందోళనలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు వివిధ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతు దగా పాలన సాగిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈరోజు నిరసనలో పాల్గొని జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

పాలకొల్లులో భారీ నల్లజెండాతో టీడీపీ నిరసన .. ఎమ్మెల్యే నిమ్మల ఫైర్

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం మైజారుగుంట గ్రామంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి పంట పొలాల్లో రెండు వందల అడుగుల భారీ నల్లజెండాతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో పంటలను పండించడం కంటే, సాగు చేయకుండా క్రాప్ హాలిడే తీసుకోవడం ఉత్తమమని రైతులు భావిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయం కోసం ఇచ్చే సాయం కంటే ప్రకటనల ఖర్చు ఎక్కువగా ఉంటుందని ఎద్దేవా చేశారు . రెండున్నర సంవత్సరాల జగన్ పాలన, రైతు దగా పాలన అని, జగన్ పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఇక రోడ్లపై బారులు తీరి, జెండాలతో బైఠాయించిన రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కారు తీరుపై దుమ్మెత్తిపోశారు.

 కాకినాడలోనూ, ప్రత్తిపాడులోనూ ఆందోళనలు .. ప్రత్తిపాడులో ట్రాక్టర్ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు

కాకినాడలోనూ, ప్రత్తిపాడులోనూ ఆందోళనలు .. ప్రత్తిపాడులో ట్రాక్టర్ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు

ఇదిలా ఉంటే ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో కూడా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నేతలు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని, కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆందోళనలో భాగంగా చేస్తున్న ట్రాక్టర్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మరోవైపు నియోజకవర్గంలోనూ తుని టిడిపి ఇన్చార్జ్ యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.

 కోనసీమ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు .. జగన్ తీరుపై తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహ జ్వాలలు

కోనసీమ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు .. జగన్ తీరుపై తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహ జ్వాలలు

కోనసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు తెలియజేస్తూ రైతు సమస్యలు పరిష్కరించాలని జగన్ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఎన్నికలకు ముందు రైతులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని, కౌలు రైతులకు భరోసా లేదని, నిత్యం అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం రైతులపై విద్యుత్ మీటర్లు బిగించి పెనుభారం వేస్తుందని మండిపడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేవని, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు కనీసం సబ్సిడీ ఇవ్వటం లేదని, రైతులను అడుగడుగునా దగా చేస్తున్నారని మండిపడుతున్నారు.

English summary
The Telugu Desam Party, in support of the farmers, has been fighting for five days from yesterday. Concerns continue across konalaseema that the TDP fighting for msp to farmers as part of its agitation. Farmers in Maijarugunta village in Palakollu zone of West Godavari district declared a crop holiday and organized agitation with a huge black flag of two hundred feet in the crop fields. In Kakinada City constituency, Tuni, Prattipadu constituency, TDP leaders protests for the farmers problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X