నిమజ్జనం: వైకాపా దాడిలో తెదేపా కార్యకర్త మృతి

నరసరావుపేట: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెంలో వైకాపా వర్కర్స్ శనివారం రాత్రి జరిపిన దాడుల్లో తెదేపా వర్కర్ ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అర్దరాత్రి జరిగిన ఈ సంఘటనతో గ్రామం మొత్తం అట్టడికింది. పోలీసులు కథనం ప్రకారం, గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో ఇరు వర్గీయుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

ఎ.ముప్పాళ్ల వద్ద సాగర్ కాలువలో విగ్రహాన్ని నిమజ్జనం చేసి తెదేపా వర్కర్స్ స్వగ్రామానికి బయలుదేరారు. కాపుకాచిన వైకాపా వర్గీయులు ఒక్కసారిగా వారిపై దాడులకు దిగారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపల కేకలతో నలుగురు తెదేపా వర్కర్స్ రక్తం కారుతూ క్రిందపడిపోయారు. దెబ్బలనుతిన్న బంధువులు ప్రైవేటు వాహనంలో నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

TDP Worker attacked by YSRCP activist, dies

చికిత్స పొందుతూ 20 సంవత్సరాల వయసున్న పూనాటి నాగాంజనేయులు మృతి చెందాడు. పాటిబండ్ల శ్రీనివాసరావు, పూనాటి కోటీశ్వరరావు, పూనాటి హనుమంతురావు తీవ్రంగా గాయపడ్డారు. చిలకపూరిపేట గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజీవకుమార్ గ్రామానికి చేరుకుని శాంతి భద్రతలను అదులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వైకాపా వర్కర్స్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

గణేష్ నిమజ్జనంలో అపశృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో గణేశ్ నిమజ్జనోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు శనివారం అర్దరాత్రి గల్లంతై మృతిచెందాడు. చేబ్రోలుకు చెందిన ఫణిరాజు(26) అలియాస్ కొండబాబు రామచంద్రాపురంలో జరిగిన నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గోన్నాడు.

గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పంటకాల్వలో దిగి కొండబాబు గల్లంతయ్యాడు. కొంతసేపటి తర్వాత భర్త కనిపించడంలేదని అతని భార్య వరలక్ష్మీ ఆందోళన చెందడంతో కొండబాబు కోసం గాలించారు. మృతదేహాన్ని స్దానికులు ఆదివారం ఉదయం వెలికితీశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+