పవన్, నాగబాబులు వస్తే ఆహ్వానిస్తాం కానీ: యనమల

 TDP Yanamala responds on Pawan joining rumors
హైదరాబాద్: మెగా సోదరులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబులు తమ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. తెలుగు ప్రజల కోసం పోరాడేందుకు తెలుగుదేశం పార్టీయే సరైన వేదిక అన్నారు.

అయితే మెగా బ్రదర్స్‌తో తమ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ చర్చల సమాచారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో మరికొందరు కాంగ్రెసు పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని యనమల చెప్పారు.

కాగా, పవన్ కల్యాణ్‌లోకి వెళ్తారా? అనే చర్చ గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తన సోదరుడు, పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటి నుండి పవన్ ముభావంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ టిడిపి వైపు అడుగులు వేస్తున్నారని ఇంటర్నెట్లో హల్‌చల్ సృష్టిస్తున్నారు. పవన్‌ను టిడిపి కండువాతో ఉంచిన చిత్రాన్ని ఉంచారు.

సోదరుడు నాగబాబును టిడిపి తరఫున మచిలీపట్నం ఎంపీగా బరిలో నిలపాలనే యోచనలో కూడా పవన్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే పవర్ స్టార్‌గా వెండితెరపై వెలుగుతూ 'పవనిజం' పేరిట తనదైన ముద్రను కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ మరో పార్టీలో, ఇంకొకరి నేతృత్వంలో పని చేయగలరా? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక పార్టీలో చేరడమంటే ఏదో ఒక ప్రాంతంలో 'వ్యతిరేకం' అనే ముద్ర పడిపోతుంది అనే చర్చ కూడా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+