వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫర్: చిరంజీవితో చర్చకు జగన్ ఓకే, జాగ్రత్తపడుతున్న చంద్రబాబు?

కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ఇటీవల పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఆయనపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP and TDP likely to invite Chiranjeevi చిరంజీవితో జగన్ చర్చ ,జాగ్రత్తపడుతున్న చంద్రబాబు|Oneindia

అమరావతి: కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ఇటీవల పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఆయనపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.

త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. 2018లో రాజ్యసభ టర్మ్ ముగిశాక సినిమాలకే పరిమితం అవుతారంటున్నారు. మరోవైపు, ఆయనకు గాలం వేసేందుకు టిడిపి, వైసిపిలు ప్రయత్నాలు చేస్తున్నాయంటున్నారు.

కాంగ్రెస్‌కు నో ఛాన్స్

కాంగ్రెస్‌కు నో ఛాన్స్

2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. ఆయన సభ్యత్వాన్ని పొడిగించేందుకు కావాల్సిన సంఖ్య కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి పంపించేందుకు కూడా వేరే నేతల కారణంగా ఆ అవకాశం లేకుండా ఉంది. పైగా చిరంజీవి కూడా సినిమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు జగన్ వ్యూహం, 'జనసేన'పై ప్రశాంత్ కిషోర్ ఆరాపవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు జగన్ వ్యూహం, 'జనసేన'పై ప్రశాంత్ కిషోర్ ఆరా

చిరంజీవి మౌనంగా ఉన్నప్పటికీ

చిరంజీవి మౌనంగా ఉన్నప్పటికీ

నంద్యాల, కాకినాడ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి 2019లోను జీవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై ప్రకటించకపోయినా దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన మద్దతు అవసరమవుతుంది.

రాజ్యసభ ఇచ్చేందుకు సిద్ధం

రాజ్యసభ ఇచ్చేందుకు సిద్ధం

ఈ నేపథ్యంలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఆయన పార్టీలోకి వస్తే లేదా అండగా నిలబడితే తదుపరి రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కూడా సై అంటున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇందు కోసం ఇరు పార్టీలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయంటున్నారు.

గంటా శ్రీనివాస రావుతో ప్రయత్నాలు

గంటా శ్రీనివాస రావుతో ప్రయత్నాలు

మంత్రి గంటా శ్రీనివాస రావుకు చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారా పార్టీలోకి ఆహ్వానించడం లేదా చిరంజీవికి రావడం ఇష్టం లేకుంటే రాజ్యసభకు పంపిస్తామని చెప్పడం ద్వారా పరోక్ష మద్దతు కోరేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

జగన్ ప్రయత్నాలు, చిరంజీవి నిజంగానే దూరం జరుగుతారా

జగన్ ప్రయత్నాలు, చిరంజీవి నిజంగానే దూరం జరుగుతారా

ఇప్పటికే వరుస ఓటములతో షాక్‌లో ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్ల కోసం.. చిరంజీవితో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. లండన్ నుంచి రాగానే నేతలతో ఈ విషయమై చర్చించవచ్చునని అంటున్నారు. మరో విషయమేమంటే.. పవన్ కళ్యాణ్ జనసేన 2019లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కూడా సోదరుడికి అడ్డుగా లేకుండా ఉండేందుకు చిరంజీవి దూరం జరగనున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. అసలు రాజకీయాలకు దూరమవుతారనే వాదనలో నిజం ఎంత అనే చర్చ కూడా సాగుతోంది.

English summary
Former Union minister, Tollywood actor Chiranjeevi will leave politics soon. The rumour are spreading on Chiranjeeve will leave from politics till 2018 March. YSRCP and TDP likely to invite him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X