జెడ్పీ ఛైర్మన్ ల ఖరారు వేళ కీలక పరిణామాలు - పరిటాల శ్రీరామ్, మజ్జి సిరికి బిగ్ ట్విస్ట్..!?

కూటమి నుంచి కాబోయే జెడ్పీ ఛైర్ పర్సన్ల పైన స్పష్టత వస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 27 జెడ్పీ ఛైర్మన్ స్థానాలను కూటమి దక్కించుకుంది. అల్లూరి సీతారామ రాజు సీటు వైసీపీకి దక్కింది. కాగా.. 27 జెడ్పీ స్థానాల్లో కూటమి నుంచి మూడు పార్టీల్లో ఎవరికి ఏ సీటు అనేది దాదాపు నిర్ణయించారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ నుంచి జెడ్పీ ఛైర్మన్ పదవుల కోసం సీనియర్ల వారసులు రేసులో ఉన్నారు. కాగా, పరిటాల.. మజ్జి సిరి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తుది ఎంపిక రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

జెడ్పీ ఛైర్మన్ సీట్ల పైన స్పష్టత వస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 28 జెడ్పీ ఛైర్మనలలో కూటమికి 27 స్థానాలు దక్కనున్నాయి. అందులో బీజేపీకి కడప, జనసేనకు అయిదు స్థానాలు ఖాయం కాగా.. మిగిలిన 21 జెడ్పీ ఛైర్మన్ల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సర్దుబాటులో భాగంగా కడప జెడ్పీ స్థానం బీజేపి కి వెళ్లనుంది. జనసేనకు పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామ రాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. అదే విధంగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఫలితాల్లో అల్లూరి సీతారామ రాజు జిల్లా వైసీపీ గెలుచుకుంది. దీంతో.. అల్లూరి జిల్లా స్థానంలో జనసేనకు మరో సీటు కేటాయిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక.. ఈ సారి వారసులు పెద్ద సంఖ్యలో జెడ్పీ ఛైర్మన్ స్థానాల కోసం పోటీలో ఉన్నారు.

TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
tdp-zp-chairpersons-final-list-of-candidates-to-be-announced-soon-here-the-full-details

రేసులో సీనియర్ల వారసులు- తుది కసరత్తు

అయితే, పరిటాల శ్రీరామ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసి సుమారు 4,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, సత్యసాయి జిల్లా జెడ్పీ పీఠం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. చివరి నిమిషంలో టీడీపీకి సత్యసాయి జిల్లా దక్కితే మినహా పరిటాల శ్రీరామ్ కు అవకాశం కనిపించటం లేదు. అదే విధంగా విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ రేసులో మజ్జి శ్రీను కుమార్తె మజ్జి సిరిసహస్ర ఉన్నారు. ఆమె తెర్లాం నుంచి జెడ్పీటీసీగా విజయంసాధించారు. అయితే ఆమె కులధ్రువీకరణ పత్రం విషయంలో వివాదం ఉంది. అలాగే టీడీపీ నేత కర్రోతు బంగార్రాజు కుమార్తె కర్రోతు చంద్రకళ కూడా రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి జెడ్పీ పీఠం ఖరారు కానుంది. ఏలూరు జడ్పీ చైర్మన్‌ రేసులో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె చింతమనేని నవ్య కు దాదాపు ఖాయమని చెబుతున్నారు. తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో జెడ్పీ పీఠాల కోసం సీనియర్ల వారసులు పోటీ పడుతున్నారు. ఈ రోజు లేదా రేపు పదవులు ఎవరికీ దక్కేదీ అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+