వైసీపీ వాళ్లతో మాట్లాడారో..! క్యాడర్ కు టీడీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్..!
ఏపీలో గత ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయింది. ప్రభుత్వం పూర్తిగా కుదురుకుంది. అయితే కూటమి పార్టీల్లో కీలకమైన టీడీపీలో (tdp) కింది స్ధాయిలో క్యాడర్ మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. స్థానికంగా బలంగా ఉన్న వైసీపీ నేతలతో టీడీపీ క్యాడర్ సంబంధాలు కొనసాగిస్తోంది. ఇదే అంశం టీడీపీ ముఖ్యనేతల్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో ఉంటూ వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న నర్సీపట్నం క్యాడర్ పై చింతకాయల్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానికంగా జరిగిన కార్యకర్తల భేటీలో మాట్లాడుతూ సొంత క్యాడర్ తీరుపై ఆయన అసంతృప్తి వెళ్ళగక్కారు.వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తానంటూ వారిని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో మాట్లాడినా,శుభ కార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.

పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను..
— Telugu Feed (@Telugufeedsite) January 25, 2026
సొంత పార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్న చింతకాయల విజయ్
వైసీపీ నాయకులతో మాట్లాడినా, శుభ కార్యాలకు వెళ్లినా ఊరుకునేది లేదని బెదిరింపులు
సిగ్గులేకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్లతో మాట్లాడుతున్నారని వ్యాఖ్య
సిగ్గు, లజ్జ,… pic.twitter.com/xi9gWcuGAk
సిగ్గులేకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్లతో మాట్లాడుతున్నారని చింతకాయల విజయ్ వ్యాఖ్యానించారు. అలాంటి వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వారిపై సరైన సమయంలో చర్యలు ఉంటాయన్నారు. సిగ్గు, లజ్జ, మానవత్వం ఉంటే వైసీపీ వాళ్లతో మాట్లాడకూడదంటూ టీడీపీ క్యాడర్ ను విజయ్ హెచ్చరించారు. అటువంటి వాళ్ళని ఒంగోపెట్టి తన్నేస్తానంటూ వ్యాఖ్యానించారు. దీంతో చింతకాయల విజయ్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications