కేసీఆర్-జగన్ పై గోరంట్ల షాకింగ్ కామెంట్స్-పవన్ ను రెచ్చగొడుతున్న వైసీపీ..!

ఏపీ విభజన జరిగి దశాబ్దం దాటిపోయినా ఇంకా విభజన సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయంటే అందుకు జగన్, కేసీఆరే కారణమని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కేసీఆర్ తన కంటే జూనియర్ అని, జగన్ ఓ డిక్టేటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు విజనరీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ అర్దం చేసుకుంటుంటే, వైసీపీ మాత్రం ఆయన్ను సినీ ఇండస్ట్రీలో పెద్దల ద్వారా ఆయన్ను రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూటమి సర్కార్ కొనసాగుతుందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ది జరగలేదని, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పరిశ్రమల విషయంలో ప్రజల్ని పూర్తిగా నిరాశపర్చారని గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు. కానీ ఇప్పుడు జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిగువరాష్ట్రంగా గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును నిర్మించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

TDP s Gorantla Slams KCR Jagan Over State Division Issues Attacks YSRCP for Provoking Pawan

కేసీఆర్, జగన్ ఇద్దరూ గతంలో విభజన సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకున్నారని, తాను తెలుగు వర్శిటీ సమస్యకు పరిష్కారం చూపించానని గోరంట్ల గుర్తుచేసుకున్నారు. విభజన సమస్యలకు ముగింపు పలకాలంటే చిత్తశుద్ధి అవసరం అన్నారు. గత వైసీపీ హయాంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలకు నోరు అదుపులో పెట్టుకోవాలని గతంలోనే తాను చెప్పానని, కానీ వినకపోవడం వల్లే వాటి పరిణామాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు. తాను మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడుతూనే ఉంటానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+