పదో తరగతి అమ్మాయికి ఉపాధ్యాయుడి లైంగిక వేధింపు

హస్టల్‌ల్లో ఉంటున్న బాలికను తరుచూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గతంలో పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసి టిసి ఇవ్వాలని అడిగారు. అయితే యాజమాన్యం మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది.
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు బాలికను సొంత ఊరికి తీసుకెళ్ళారు. సుదాకర్ బాలిక ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తికి ఫోన్ చేసి బాలికతో మాట్లాడాలన్నారు. ఆ వ్యక్తి సదరు ఉపాధ్యాయుడు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి బాలిక తల్లిదండ్రులకు వినిపించాడు. దాంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి యాజమాన్యంతో ఘర్షణకు దిగారు.
ఇది గమనించిన ఉపాధ్యాయుడు సుధాకర్ పాఠశాల నుంచి పరారయ్యాడు. తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications