బాలికపై టీచర్ అత్యాచారం: కన్నకూతురిపై దారుణం

Teacher rapes girl student in Krishna district
హైదరాబాద్: మానవత్వం మంట కలిసిన సంఘటనలు రెండు ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జరిగాయి. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, ప్రవర్తనను తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడే బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మరో ఘటనలో మద్యానికి బానిసైన తండ్రి కన్నకూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పరమర నాయుడు పాలెంలో 14 ఏళ్ల బాలిక బంధువుల ఇంటికి వెళ్లి గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా కరెంట్ పోయింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ కాలేషావలి (30) బాలికను బలవంతంగా పాఠశాలలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.

బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి విషయాన్ని చెప్పడంతో బాలిక బంధువులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో పది రోజుల కిందట ఇంట్లో కూతురు ఒంటరిగా ఉన్న సమయంలో మద్యానికి బానిసైన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు (16) జగ్గయ్యపేటలో ఉన్న బాబాయికి విషయం చెప్పడంతో అతను వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశాడు.

మళ్లీ నాలుగు రోజుల కిందట అఘాయిత్యానికి పాల్పడడంతో బాధితురాలు మేనత్త ఇంటికి చేరుకుని విలపించింది. నిందితుడు తన కూతురును ఇంటికి పంపించాలని రెండు రోజులుగా ఆ ఇంటి తిరుగుతుండడంతో బాధితురాలు బాబాయి ఇంటికి వెళ్లింది. ఆయన శుక్రవారం చిల్లకల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+