టెక్కీ అనూహ్య కేసు: తండ్రికి పోలీసులు పిలుపు!
విజయవాడ: గత సంవత్సరం జనవరి 5న హత్యకు గురైన సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య తండ్రికి ముంబై పోలీసుల నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. అనూహ్య స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నం. అనూహ్యకు చెందిన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్తించేందుకు పిలిచి ఉంటారని తెలుస్తోంది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా టెక్కీ అనూహ్య హత్య కేసు నిందితుడు చంద్రబాన్‌ను ఇద్దరు సాక్షులు గుర్తించిన విషయం తెలిసిందే. మచిలీపట్నంవాసి, ఉద్యోగరీత్యా ముంబైలో నివాసం ఉంటున్న అనూహ్య గత ఏడాది జనవరిలో దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆమెను హత్య చేసినట్టుగా భావిస్తున్న చంద్రబాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం అతడిని టాక్సీ డ్రైవర్ రమేశ్ రాథోడ్‌కు, బండి పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు గణేశ్ శెట్టికి చూపారు. వారిద్దరూ అతణ్ని గుర్తించారు.

హత్య జరిగిన రోజు ఉదయం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి అనూహ్య, చంద్రబాన్ బయటికి వస్తుండగా తాను అతణ్ని టాక్సీ కావాలా అని ప్రశ్నించానని రమేష్ రాథోడ్ వివరించాడు. అప్పుడు అతను తన మోటార్ సైకిల్‌ను పార్కింగ్‌లో పెట్టినట్టు తనతో చెప్పాడని రాథోడ్ తెలిపాడు.
మచిలీపట్నంకు చెందిన ఎస్తేరు అనూహ్య అదృశ్యమైన అనంతరం పదకొండు రోజుల తర్వాత ముంబైలోని ఓ నిర్జన ప్రదేశంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆమె తండ్రి నాడు కేంద్ర హోంమంత్రిని కలిసి కూడా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications