ఇది మిస్టరీ: మిత్రుడితో కలిసి టెక్కీ ఆత్మహత్య

Techie along with his friend commit suicide
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాదులోని చిలకలగూడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జామైఉస్మానియా అంబర్‌నగర్‌లో చోటు చేసుకుంది. మెదక్‌జిల్లాకు చెందిన బి.సంపత్(29), నిజామాబాద్‌కు చెందిన కె.సంపత్ (25) ఇద్దరు స్నేహితులు. వీరు నగరంలో ఎంబిఎ పూర్తిచేశారు. బి.సంపత్ మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, కె.సంపత్ సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఈ మధ్యనే ప్రమోషన్ కూడా వచ్చి సంవత్సరానికి పది లక్షల ప్యాకేజీ లభించింది.

వీరిద్దరు ప్రతి చిన్న విషయంలో కలత చెందేవారని అంటున్నారు. సోమవారం మద్యాహ్నం పురుగుమందు సేవించారు. ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే బి.సంపత్ మృతిచెందగా, కె.సంపత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. కేసును చిలకలగూడ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, ఆత్మహత్యకు సంబంధించిన ఏ విధమైన ఆధారాలు కూడా పోలీసులకు లభించలేదు. సూసైడ్ నోట్ కూడా లభించలేదని తెలుస్తోంది. ఎంబిఎ చదువుతున్న సమయంలో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. బేగంపేటలోని సెల్యుజెనికి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న కె సంపత్‌ కుమార్ తన సోదరుడితో కలిసి చింతల్‌లో ఉంటున్నాడు. బి. సంపత్ అంబర్‌నగర్‌లో ఉంటున్నాడు.

పది రోజుల క్రితం సంపత్‌ కుమార్ అంబర్ నగర్‌లోని సంపత్ ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మరో మూడు రోజుల్లో గజ్వెల్‌లో మెడికల్ షాపు ప్రారంభించేందుకు బి. సంపత్ ఏర్పాట్లు చేసుకున్నాడు. కె. సంపత్ కుమార్‌కు మరో కంపెనీ నుంచి ఏడాదికి 8 లక్షల రూపాయలతో జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ నెల 25వ తేదీలోగా అతను కొత్త సంస్థలో చేరాల్సి ఉండింది.

జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్న తరుణంలో వారిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది మిస్టరీగా మారింది. లోపలి నుంచి తలుపులకు గడియ వేసుకుని గదిలో వారు మరణించి ఉన్నారు. అందువల్ల వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారనే నిర్ధారణ జరుగుతోంది. ఇరువురు వాడిన మూడు సెల్‌ఫోన్ల ఆధారంగా మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+