హోంగార్డుపై దాడి, ఎస్‌ఐపై దుర్భాషలు: టెక్కీ అరెస్టు

బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 2లోని ఐగేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విదులు నిర్వహించే గోవింద మురళి గురువారం ఉదయం శ్రీకృష్ణనగర్ నుండి తన ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈ క్రమంలో పూర్ణసెంటర్ చౌరస్తాలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు శ్రీహరి ద్విచక్రవహనాన్ని ఆపాడు. తనను ఎందుకు ఆపారంటూ గోవింద మురళి శ్రీహరిపై కేకలు వేశాడు.
తమ సార్ రమ్మంటున్నారు, రావాలంటూ హోంగార్డు చెప్పాడు. ఎందుకు రావాలి, నేను మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్‌బెల్ట్ పొందాను 40 మంది వచ్చినా కొడతానంటూ వీరంగం సృష్టించాడు. ఈ విషయాన్ని గమనించిన మరో కానిస్టేబుల్ కెమెరాలో దీన్ని బంధిస్తుండగా కోపోద్రిక్తుడైన గోవింద మురళి ఒక్కసారిగా వారిపై దాడిచేసి, కెమెరాను ధ్వంసం చేశాడు.
దీంతో పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకొని జూబ్లీహిల్స్ సివిల్ పోలీసులకు అప్పగించారు. గోవింద్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను గురువారం రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications