హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నానం చేస్తుండగా యువతి వీడియో తీసిన టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాత్రూంలో స్నానం చేస్తున్న యువతి వీడియో తీసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోలీసలకు చిక్కాడు. బాత్రూంలో స్నానం చేస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కలవ ారు వచ్చి అతడ్ని పట్టుకున్నారు.

తాము పట్టుకున్న టెక్కీని స్థానికులు హైదరాబాదులోని మెహిదీపట్నం పోలీసులకు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయున్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ ఆనంద్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

గచ్చిబౌలిలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం హుమాయున్‌నగర్‌లోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారంనాడు అతను తన ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా ఎదురింట్లోని బాత్రూంలో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది.

Techie arrested for capturing images of a girl

దాంతో అనతు బాత్రూం వెంటిలేటర్ నుంచి చూశాడు. స్నానం చేస్తున్న యువతి అతనికి కనిపించింది. దాంతో అతను తన సెల్‌ఫోన్ ద్వారా ఆ దృశ్యాలను చిత్రీకరించడం ప్రారంభించాడు. దాంతో అలికిడి అయింది. దాంతో ఉలిక్కిపడిన యువతి వెంటిలేటర్ వైపు చూడగా సెల్‌ఫోన్‌తో ఎవరో తనను చిత్రీకరిస్తున్నట్లు కనిపించింది.

ఆ సంఘటనతో యువతి పెద్దగా కేకలు వేసింది. దాంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి దినేష్‌ను పట్టుకున్నారు. అతడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A software engineer has been arrested for capturing the iamages of a girl, while bathing, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X