నకిలీ ఫేస్‌బుక్, పెళ్లి వేధింపులు: టెక్కీ అరెస్ట్

Techie arrested for harassing colleague
హైదరాబాద్: తన సహాద్యోగిని పెళ్లి చేసుకుంటానని వేధింపులకు, బెదిరింపులకు గురి చేసిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సైబరాబాద్ సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు. బాధితురాలి పేరుతో కూడిన నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరిచి ఆమె చిత్రాన్ని కూడా అందులో పెట్టాడు. అంతేగాక తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోతే.. ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్‌లో బాధితురాలి పేరును చేర్చుతానని నిందితుడు బెదిరింపులకు గురి చేశాడు.

వివరాల్లోకి వెళితే.. విజయనగరానికి చెందిన కోటేశ్వరరావు బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని హెచ్ఏక్యూ సొల్యూషన్స్ కంపెనీలో ఓ సంవత్సర కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత కొన్ని నెలల నుంచి మహిళా సహోద్యోగిని పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేస్తున్నాడు కోటేశ్వరరావు.

అయితే కోటేశ్వరరావు అభ్యర్థను బాధితురాలు అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి ఆమెకు అసభ్యకర, బెదిరింపులకు గురిచేసే సందేశాలను పంపడం మొదలు పెట్టాడు. అంతేగాక ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేశాడు. గత నెలలో ఒకసారి బాధితురాలికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని, అందుకు బాధితురాలే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు నవంబర్ నెలలో సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేసింది.

విస్తృతంగా విచారణ కొనసాగించిన పోలీసులు సోమవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని తన ఇంట్లో నుంచి నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. నిందితునిపై ఐపిసి 509, 506 సెక్షన్ల కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66-ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టగా... జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+