లవ్ మ్యారేజీకి పెద్దలు నో: లాడ్జిలో టెక్కీ ఆత్మహత్యాయత్నం

కర్నూలు/గుంటూరు: కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ లాడ్జిలో తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగశేష సాయి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది సాయి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి సాయి ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించింది. సాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి అతడు ప్రియురాలికి ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె లాడ్జి నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. దీంతో స్పందించిన లాడ్జి సిబ్బంది అతడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.

Techie attempted to kill himself in Kurnool district

ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్తుల మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. బాపట్ల మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన దాసరి సాయికృష్ణ, ఇనుగంటి ఫణీంద్రనాథ్‌ నిన్న సూర్యలంక సముద్ర తీరానికి వచ్చి సాగర స్నానాలు చేశారు.

రాత్రి అయినా వారు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారంనాడు సూర్యలంక తీరంలోని పొగురు వద్ద ఇద్దరు యువకుల మృతదేహాలను మత్స్యకారులు గుర్తించారు. మృతులను అదృశ్యమైన సాయికృష్ణ, ఫణీంద్రనాథ్‌గా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మత్స్యకారుల సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించిన పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+