ప్రేమవివాహానికి పెద్దలు తిరస్కరణ: టెక్కీ ఆత్మహత్య

 Techie commits suicide, as elders rejects love marraige
హైదరాబాద్: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాదులోని బలరాం నగర్‌లో నవాసం ఉంటున్న రవీందర్ సింగ్ అనే 30 ఏళ్ల టెక్కీ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాసెస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

కొద్ది రోజులుగా రవీందర్ సింగ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు కూడా నిరాకరించాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్ సింగ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా, అంతకు ముందు అతను ప్రియతమా... నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రేయసికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన ఆమె రవీందర్ సింగ్ సోదరుడు మహేందర్ సింగ్‌కు సమాచారం అందించింది. అతను వచ్చేసరికే సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలోని డోన్ మండలం దొరపల్లి దగ్గర జాతీయ రహదారిని దాటుతున్న మహిళలను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+