ప్రేమ విఫలం: టెక్కీ ఆత్మహత్య, విరక్తి చెందానని నోట్

Techie commits suicide in Kukatpally
హైదరాబాద్: ప్రేమలో విఫలమై ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమలో విఫలమయ్యానని, అందుకే జీవితం పైన విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, నా చావుకు ఎవరు కారణం కాదని అతను తన సూసైడ్ నోట్‌లో రాశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన సత్యనారాయణ, అమరావతి దంపతులు కొన్నేళల్ క్రితం హైదరాబాద్ వచ్చారు.

కూకట్‌పల్లిలోని ఆల్విన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన రామ్మోహన్ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తెకు వివాహం అయింది. మరో కుమారుడు డిఫెన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

రెండు రోజుల క్రితం సత్యనారాయణ దంపతులు సొంతూరుకు వెళ్లారు. ఇంట్లో రామ్మోహన్ ఒక్కరే ఉన్నాడు. బుధవారం ఉదయం రామ్మోహన్ బావ... ఇంటికి వచ్చి చూశాడు. తలుపులకు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత కొట్టినా తలుపు తెరవక పోవడంతో గడియ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశాడు. రామ్మోహన్ ఫ్యానుకు చీరతో ఉరేసుకొని కనిపించాడు.

అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+