టెక్కీ ఆత్మహత్యలో కొత్త కోణం: టీ షర్ట్‌లో సూసైడ్ నోట్

విజయవాడ: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొమ్మరి కృష్ణమూర్తి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతను విజయవాడలోని మాచవరంలో గల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య వెనక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆస్తికి సంబంధించిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

టెక్కీ కొమ్మరి కృష్ణమూర్తి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి వీరయ్య గుణదల కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో పనిచేస్తూ పదవీ విరమణ చేశాడు. కృష్ణమూర్తికి ఆరేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన గీతతో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల తేజస్విని అనే కూతురు ఉంది.

 Techie commits suicide: Suicide note found in T shirt pocket

సెలవు కావడంతో గత ఆదివారంనాడు కృష్ణమూర్తి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అయితే, తల్లిదండ్రులు వ్యక్తిగత పనుల మీద సోమవారం హైదరాబాదు బయలుదేరారు. తనకు విజయవాడలో పని ఉందని చెప్పి తల్లిదండ్రులకు చెప్పాడు కృష్ణమూర్తి. అయితే, మంగళవారం ఉదయం కృష్ణమూర్తి ఫోన్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి సాయంత్రం ఇంటి సమీపంలోని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు.

బంధువు వెళ్లినప్పుడు గేటుకు బయట తాళం వేసి ఉంది. అనుమానంతో తాళం తీసి పై అంతస్తులో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. కిటికీలోంచి చూడగా గదిలో ఉరికి వేలాడుతూ కృష్ణమూర్తి కనిపించాడు. దాంతో అతను కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడు కృష్ణమూర్తి వేసుకున్న టీ షర్టులో పోలీసులు సూసైడ్ నోట్ లభించింది. బిల్డర్ మహేష్ తమ దగ్గరి నుంచి బలవంతంగా విలువైన ఆస్తిని తీసుకోవడంతో మనస్తాపానికి గురైనట్లు అతను ఆ సూసైడ్ నోట్‌లోరాశాడు. మహేష్ ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+