విషాదం: పెళ్లి ముందు రోజు టెక్కీ ఆత్మహత్య, ఎందుకిలా చేశాడు?

విజయవాడ: పెళ్లికి ముందుకు రోజే ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. తన స్నేహితులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తానని చెప్పిన ఉదయం వెళ్లిన టెక్కీ సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. తన బైక్ ప్రమాదానికి గురైందని చెప్పాడు. అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులకు చెట్టకు వేలాడుతూ అతని అతని మృతదేహం కనిపించింది. దీంతో వారు కన్నీరుమున్నీరు అయ్యారు.

తన కొడుకు మంచి కంపెనీలు సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని సంతోషించిన తల్లిదండ్రులకు చివరికి కన్నీరు మిగిలింది. పెండ్లిమర్రి మండలానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి టెక్కీగా బెంగళూరులో పని చేస్తున్నాడు. అతనికి పెళ్లి సంబంధం కుదిరింది. తెల్లారితే పెళ్లి.

మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన విష్ణు స్నేహితులకు పత్రికలు ఇవ్వాలని, షేవింగ్ చేసుకొని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి పోలాలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పిచ్చిరెడ్డి, రాములమ్మల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Techie ends life hours before marriage in AP

విష్ణు (29) మూడు సంవత్సరాలుగా బెంగుళూరులో టాటా కన్సల్‌టెన్సి సర్వీసులో టెక్కీగా పని చేస్తున్నాడు. వీరపునాయనిపల్లె మండలానికి చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. ఈ నెల 14వ తేదీ (ఆదివారం) వారి వివాహం జరగాల్సి ఉంది. అయితే శుక్రవారం ఉదయం విష్ణు బైక్ పైన ఇంటినుంచి కడపకు బయలుదేరాడు.

తాను వైవీయూ సమీపంలో కింద పడ్డానని వచ్చి తీసుకు వెళ్ళాలని రాత్రి తొమ్మిది గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వారు ఆగమేఘాలమీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. బైక్‌ను గుర్తించారు.

అయితే విష్ణు ఆచూకీ తెలియలేదు. చుట్టు పరిశీలించారు. చివరకు సమీపంలో పోలాల్లో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందిన విష్ణుని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. పెళ్ళి ఇష్టం లేక ఇలా చేసాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+