మెసేజెస్: టెక్కీని లోబర్చుకునేందుకు అంకుల్ తంటాలు

దానిని మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) సింగపూర్‌లో ఉంటున్నారు. దీంతో ఎండి తండ్రి ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇందులో ఇరవై మూడేళ్ల యువతి హెచ్ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మూడు నెలలుగా అతను ఆమెను వేధిస్తున్నారు.
ఆమెను లోబర్చుకునేందుకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడు. మనం గత జన్మ ప్రేమికులమంటూ మెసేజ్‌లు పంపించేవాడు. సాయంత్రం విధులు ముగించుకున్న తర్వాత ఇంటి వద్ద దిగబెడతానని చెబుతూ పక్కన కూర్చుండ బెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఫోన్లోని అశ్లీల చిత్రాలు చూపించి లోబర్చుకునే ప్రయత్నాలు చేశాడు.
అతని వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయిన బాధితురాలు ఇటీవలె ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని పైన కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications