పనిమనిషిపై అసభ్యంగా ప్రవర్తించిన టెక్కీ అరెస్టు
హైదరాబాద్: పని మనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ టెక్కీ కటకటాల పాలయ్యాడు. పని మనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఐబియం ఇంజనీర్‌ను హైదరాబాదులోని దబీర్‌పురా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.
36 ఏళ్ల మహిళ కొన్ని నెలల క్రితం నూర్ ఖాన్ బజార్‌లోని ఎంఎ అలీం అనే వ్యక్తి ఇంట్లో పని మనిషిగా చేరింది. ప్రతి రోజూ ఆమె ఉదయం ఆరున్నర గంటలకు వచ్చి మూడు గంటల తర్వాత వెళ్లిపోతుంది.

గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఓ పడక గదిని శుభ్రం చేస్తుండగా అలీం కుమారుడైన 32 ఏళ్ల ముఖీద్ ఆమె చేయిని పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. అతను ఐబియంలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.
ఆ సంఘటనతో బిత్తరపోయిన పని మనిషి కేకలు వేస్తూ గది బయటకు పరుగెత్తుకుని వ్చచింది. ఇరుగు పొరుగువారు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications