ఐఐటి కొట్టాలని వచ్చిన అమ్మాయిని రేప్ చేసి, చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్

భోపాల్: ఐఐటి సాధించాలని వచ్చిన 17 ఏళ్ల అమ్మాయి ఆశలను నీరు గార్చడమే కాకుండా ఆమెను కోలుకోని రీతిలో దెబ్బ తీసిన వైనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆమె ఉంటున్న హాస్టల్‌ యజమాని 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను నగ్నంగా చిత్రీకరించి, నెలల తరబడిగా బ్లాక్ మెయిల్ చేశాడు. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది.

రాజ్‌గఢ్‌కు చెందిన బాధితురాలు ఐఐటి కోచింగ్ కోసం 2014 మేలో భోపాల్ వచ్చింది. గౌతం నగర్‌లోని హాస్టల్లో ఉంటూ వచ్చింది. హాస్టల్ యజమాని అయిన నిందితుడు నరేంద్ర నాగవంశీ అమ్మాయిని వేధించడమే కాకుండా క్వార్టర్స్ మార్పించాడు.

ఆ తర్వాత నాగవంశి ఆమెను పిలిచి క్షమాపణ చెప్పాడు. ఓ మిత్రుడి బర్త్ డే కేక్ కొనడానికి తనతో రావాల్సిందిగా అడిగాడు. ఆమె అంగీకరించి అతని వెంట వెళ్లింది. అతను ఆమెను తన గదికి తీసుకుని వెళ్లాడు. ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెపై లైంగిక దాడికి దిగాడు.

Teen raped, filmed & blackmailed

నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలో చిత్రీకరించాని, దాన్ని బయటపెడుతానని అతను ఆమెను బెదిరించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా 50వేల రూపాయలు ఆమె నుంచి లాగడానికి ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పేవాడు.

చివరకు బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో తల్లిదండ్రులు భోపాల్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతన్ని పట్టుకుని వీడియో క్లిప్‌ను స్వాధీనం చేసుకుంటామని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+