బాలికపై షేక్ రేప్, కేసు: కూతురిని కూడా అందులోకి..

Teenager was raped for about a year
హైదరాబాద్: పాతబస్తీకి చెందిన బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించిన ఆమె కన్నతల్లి, అక్క, బావల ఉదంతం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై నిందితుల పైన ఫలక్‌నుమా పోలీసులు గురువారం పిటా (ప్రొటక్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్టు), నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు బుధవారం రాత్రి స్థానిక యువకుడు ఇబ్రహీం సహకారంతో తెలంగాణ పీయూసీఎల్ అధ్యక్షురాలు జయవింధ్యాల, ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ ఖాన్‌లను కలిశారు.

ఆ సమయంలో బాలిక మీడియా ముందు తన బాధను వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం ఫలక్‌నుమా అదనపు ఇన్స్‌పెక్టర్ ఎం సురేందర్‌తో కలిసి ఫలక్‌నుమా ఏసీపీ ఎంఏ బారి విలేకరులకు వివరాలు వెల్లడించారు.

వట్టేపల్లి ముస్తఫానగర్‌కు చెందిన తల్లి, బావ, సోదరి సహకారంతో డబ్బు కోసం చిన్న కూతురితో ఏడాదిగా వ్యభిచారం చేయిస్తున్నారన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరో ఆరేడు మందికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.

బాధితురాలి బావ నాలుగు నెలల క్రితం కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో కన్నకూతురికి ఆరు ఒప్పంద వివాహాలు జరిపించిన కేసులో నిందితుడని పేర్కొన్నారు. అతడితో పాటు నిందితులందరినీ త్వరలో అరెస్టు చేస్తామని ఏసీబీ బారి తెలిపారు. ఇలాంటి ఆకృత్యాలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. అతను కూతురిని, సోదరిని కూడా ఈ వ్యభిచార కూపంలోకి నెట్టినట్లుగా తెలుస్తోంది.

కాగా, వివరాల్లోకి వెళితే.. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన అమ్మాయి(14)తో సంవత్సరం నుంచి సోదరి భర్త బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సోదరిని, తనను చంపేస్తానంటూ బావ బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో గత్యంతరం లేక ఒప్పుకున్నానని బాధితురాలు వాపోయింది. కన్నతల్లి కూడా చిత్రహింసలు పెట్టినట్లు కన్నీటి పర్యంతమైంది. వారిద్దరూ తనను పలు ఫాంహౌస్‌లకు పంపేవారని చెప్పింది. ఆరు రోజుల క్రితం ఓ అరబ్ షేక్‌కు అంటగట్టారని వాపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+