సినిమా థియేటర్స్ ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్ కు లేదు: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సినిమా థియేటర్స్ సీజ్ విషయంలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో సినిమా థియేటర్లను తహసిల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సినిమా థియేటర్లను సీజ్ చేసే అధికారం తహసీల్దార్ కు లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. తహసిల్దార్ థియేటర్ కు తాళం వేయడాన్ని హైకోర్టు తప్పని పేర్కొంది. ఏపీ సినిమా నియంత్రణ రూల్స్ 1970 ప్రకారం లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న సంయుక్త కలెక్టర్ కు మాత్రమే థియేటర్ ను జప్తు చేసే అధికారం ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

సీజ్ చేసిన థియేటర్ ను తెరవాలని తహసీల్దార్ ఆదేశం
నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేట లోని శ్రీనివాస మహల్ థియేటర్ ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తహసిల్దార్ ప్రకటించారు. అయితే సినిమా థియేటర్ ను సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ తహసిల్దార్ నిర్ణయంపై థియేటర్ యజమాని శంకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాది టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. అయితే ఆ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. థియేటర్ ను తెరవాలని తహసీల్దార్ ను ఆదేశించింది.

జాయింట్ కలెక్టర్ కు మాత్రమే థియేటర్ ను సీజ్ చేసే అధికారం ఉంటుందన్న న్యాయమూర్తి
లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్ కు మాత్రమే థియేటర్ ను సీజ్ చేసే అధికారం ఉంటుందని న్యాయమూర్తి వెల్లడించారు. మూసివేసిన థియేటర్ను వెంటనే తెరవాలని, థియేటర్ లో సినిమాలు ప్రదర్శించడానికి యాజమాన్యానికి అనుమతినిచ్చారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేశారు. అయితే లైసెన్సు పునరుద్ధరణ వ్యవహారం సంబంధిత అధికారి వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సినిమాలను ప్రదర్శించుకోవచ్చని కోర్టు వెల్లడించింది.

టికెట్ల ధరలు, థియేటర్లలో వసతులపై ప్రభుత్వానికి, యాజమాన్యాలకు మధ్య రచ్చ
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో వసతులు అంశంపై ఏపీ ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యాలను మధ్య రచ్చ కొనసాగింది. పలుచోట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు థియేటర్లను మూసివేశాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని థియేటర్ల యాజమాన్యాలు వ్యతిరేకించడంతో థియేటర్లను పరిశీలించి నిబంధనలను పాటించడం లేదంటూ పలు థియేటర్లను ప్రభుత్వం మూసివేసింది.

కోర్టుకెళ్ళిన పలువురు యజమానులు.. కోర్టు కీలక వ్యాఖ్యలు
మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలో 83 థియేటర్లు అధికారులు సీజ్ చేశారు. సినిమా థియేటర్లలో ప్రేక్షకులు సదుపాయాలు కల్పించాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్యాంటీన్లలో అమ్మే తినుబండారాల ధరలతో సహా అనేక అంశాలలో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఈక్రమంలోనే నిబంధనలు పాటించని థియేటర్లను సీజ్ చేసింది. దీంతో పలువురు థియేటర్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో, తాజాగా ఓ కేసులో కోర్టు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. తహసిల్దార్ కు థియేటర్ ను సీజ్ చేసే అధికారం లేదని తేల్చి చెప్పింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications