తెలంగాణ విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. రూ. 1,011 కోట్లతో క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవుటర్ రింగ్ లోపల విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కోసం 1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ ను 20 వేల కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడేలా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. విద్యా శాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని.. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యా శాఖ మంత్రిగా చూడాలని తెలిపారు. కావాలనే విద్యా శాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"1969 తొలి తెలంగాణ ఉద్యమం, 2009 మలి తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీల విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నిధులు, నియామకాలు, రాజకీయ ప్రాతినిధ్యం పైన ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు ఉద్యమ బాటన నడిచారు. యూనివర్సిటీ లు, విద్య ను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ లోని తండాలు, గూడాలు,మారు ముల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందించాలని విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకుని అడుగులు ముందుకు వేస్తున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"11000 ఉపాధ్యాయ నియామ కాలను 60 రోజుల్లో చేశాం. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. టీచర్ల బదిలీలు అంత ఆషామాషీ కాదు. 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా చేశాం. నీతి ఆయోగ్ విద్యా శాఖలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది. విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నాను. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. 12 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 38 లక్షల మంది చదువుతున్నారు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న గొప్పతనం ఏమిటీ.. ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్న లోపం ఏమిటీ..? రాష్ట్ర బడ్జెట్ లో 8 శాతం నిధులను విద్య కోసం కేటాయించాం. వచ్చే యేడాది విద్యకు అధికంగా నిధులు ఇస్తాం. 15 శాతానికి క్రమంగా పెంచుతాం. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబట్టడమే లక్ష్యం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. 25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యా విధానం పరిశీలనకు ఫిన్లాండ్ దేశానికి పంపించాం. అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపిస్తాం. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున టీచర్లకు సన్మానం చేస్తాం. తెలంగాణ కు నూతన విద్యా విధానాన్ని తీసుకువస్తున్నాం. దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉండాలన్నదే ప్రయత్నం. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం. పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్ లో డ్రాఫౌట్స్ పెరుగుతున్నాయి. పేద విద్యార్థులు ఆర్థాకలితో పాఠశాలలకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన భోజనం అందిస్తాం. పాఠశాల విద్యార్థులకు పాలు, రాగిజావ అందిస్తాం. కొడంగల్ లో ఫైలెట్ ప్రాజెక్టు గా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. ప్రభుత్వం పాఠశాల్లో చదవే విద్యార్థులు మా పిల్లలతో సమానం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"తల్లిదండ్రుల్లా మా ప్రభుత్వం విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటుంది. 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు, 40 శాతం డైట్ ఛార్జీలు పెంచాం. రేపటి తెలంగాణ ప్రభుత్వ పాఠశాల గదుల్లోనే ఉందని మేం భావిస్తున్నాం. విద్యా శాఖ పైన పెట్టే ఖర్చును భవిష్యత్తు తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం. యూనివర్సిటీలల్లో సదుపాయాల కల్పన వందలాది కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ ను 20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. తెలంగాణ లోని పేదల బిడ్డలు ధైర్యంగా గుండె పైన చేయి వేసుకుని యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ లో చదువుకున్న అని చెప్పాలన్నదే నా ధ్యేయం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"మేం అంతా ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కాదు.. అభివృద్ధి వేదికలు.. కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాం.. పాఠశాలలు టీచర్లు, ఐఎఎస్ లు, రాజకీయ నాయకుల కోసం కాదు...పేదల విద్యార్థుల కోసం.. పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయమైనా వెనకడుగు వేయకుండా తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే ఎడ్యూకేషన్ కిట్ నాణ్యతను నేనే స్వయంగా పరిశీలించాను. పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరైన సమయంలో విద్యార్థులకు చేరాలి.పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్ ను అందజేస్తున్నాం.. మరో జత నెలాఖారున ఇస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"ఎడ్యూకేషన్ కిట్ కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నాణ్యమైన వస్తువులు రాకపోతే తక్షణమే ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి. నాణ్యత లేని వస్తువులను సప్లై చేసే కంపెనీల ను బ్లాక్ లిస్టు లో పెట్టి బొక్కలో తోయించే బాధ్యత నాది. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూటికి నూరు శాతం మార్కులు రావాలన్నదే నా కల. టీచర్లకు మొదటి తారీఖున జీతంతో పాటు మౌలిక సదుపాయలు కల్పించే బాధ్యత నాది. ప్రభుత్వ టీచర్ల కు ఉద్యోగం కాదు భావ్వోదేగం .. బరువు కాదు బాధ్యత. 19 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతిలో ఉంది. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలి.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

"తెలంగాణ విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడేలా ముందుకు సాగుదాం. విద్యా శాఖ కు మంత్రి లేడని కొండరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రి గా కాకుండా విద్యా శాఖ మంత్రిగా చూడండి. కావాలనే నేను విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను. మంచి విద్యను అందించిన బాధ్యత కల్గిన పౌరులను దేశానికి అందించాలన్నదే నా ఉద్దేశం. త్వరలోనే విద్యా శాఖలో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications