జగన్ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్! అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనసభా సమావేశాల వేడి పెరిగింది. కాకినాడ జిల్లా తుని పర్యటనలో ఉన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా విరుచుకుపడ్డారు. చట్టసభలకు రాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ఉండాలంటే పార్లమెంట్ పరిధిలోనే ఇలాంటి కఠిన నిబంధనలు తేవాల్సిన అవసరం ఉందన్నారు.

AP Speaker Ayyanna Demands Central Law to Withhold Salaries of Absent MLAs Targets YS Jagan

అసెంబ్లీకి రావాల్సిందే.. :జగన్‌కు స్పీకర్ నేరుగా సూచన

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే ప్రజలు జగన్‌ను గెలిపించారని, కాబట్టి ఆయన బాధ్యతాయుతంగా సభకు హాజరుకావాలని స్పీకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఇకపై దొంగ హాజరులకు తావులేకుండా సరికొత్త డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు ప్రత్యక్షంగా కూర్చున్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్ కెమెరాలు ఆన్ అవుతాయని, అప్పుడే వారి హాజరును అధికారికంగా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. కాగా, ఈ నెల 17న నిర్వహించనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ అనూహ్య నిర్ణయం, కీలక నియామకం- కొత్త లెక్కలు..!!
అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ అనూహ్య నిర్ణయం, కీలక నియామకం- కొత్త లెక్కలు..!!

డీఎస్సీపై దుష్ప్రచారం ఆపండి: స్పోర్ట్స్ కోటా అంటే జగన్‌కు తెలుసా?

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీ నియామకాలపై జగన్ మరియు వైఎస్సార్‌సీపీ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగ యువతను హేళన చేసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడటం దారుణమన్నారు. అసలు జగన్‌కు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో కనీస అవగాహన ఉందా అంటూ ఎద్దేవా చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తే ఓర్వలేక మానసికంగా కుంగదీసేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలకు TDP కొత్త ఇంఛార్జ్ లు- వాటిల్లో మార్పు వెనుక..!!
అసెంబ్లీ నియోజకవర్గాలకు TDP కొత్త ఇంఛార్జ్ లు- వాటిల్లో మార్పు వెనుక..!!

ప్రభుత్వాన్ని మార్చడానికి జగన్ ఎవరు?

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను మార్చే పూర్తి అధికారం కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన, నిర్ణయాలు నచ్చకపోతే తగిన సమయంలో ప్రజలే ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మారుస్తారని పేర్కొన్నారు. అంతేగానీ, ప్రభుత్వాన్ని మార్చేయడానికి జగన్ ఎవరు అని నిలదీశారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇప్పటికీ అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తే ప్రజలు మరింతగా దూరమవుతారని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+