ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన మార్గం: మనకు ఇంత దగ్గర్లోనే!
ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది ఇటీవల ఓ ఎయిరిండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. థాయిలాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల వల్ల గాల్లోనే భారీ కుదుపులకు గురైంది. దీంతో ఒక్కసారిగా విమానం ఎత్తు తగ్గింది. ఒడిశా గగనతలంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా 300 అడుగుల మేర కిందకు పడిపోవడంతో తీవ్ర అలజడి రేగింది. ఈ ప్రమాదంలో 145 మంది ప్రయాణీకులలో నలుగురు సిబ్బందితో సహా మొత్తం 17 మంది గాయపడ్డారు. ఇది కేవలం వాతావరణ మార్పుల వల్ల జరిగింది కాదని.. విమాన పైలట్ గంజాయి మత్తులో ఉండటమే అసలు కారణమని.. అతనికి నిర్వహించిన రెండో డ్రగ్ టెస్టులో కూడా పాజిటివ్ గా తేలిందని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
విమాన ప్రయాణంలో టర్బులెన్స్ అనేది ఆకాశంలో గాలి కదలికల్లో అకస్మాత్తుగా ఏర్పడే అస్థిరత వల్ల వస్తుంది. మేఘాలలో బలమైన గాలులు వీచడం, పర్వత ప్రాంతాల వద్ద గాలి ప్రవాహంలో మార్పులు, వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న గాలి పటలాలు ఒకదానితో ఒకటి కలవడం వల్ల విమానాలు కుదుపులకు గురవుతాయి. కొన్నిసార్లు ఎలాంటి మేఘాలు లేని నిర్మలమైన ఆకాశంలో కూడా క్లియర్-ఎయిర్ టర్బులెన్స్ ఏర్పడుతుంది. సాధారణంగా ఆధునిక విమానాలను కుదుపులను తట్టుకునే శక్తితో రూపొందిస్తున్నారు.

అత్యంత కుదుపులతో కూడిన విమాన మార్గాలు
ప్రపంచవ్యాప్తంగా అనేక మార్గాలు విమాన ప్రయాణంలోని కుదుపులకు ప్రసిద్ధి చెందాయి. కాఠ్మండు(నేపాల్)-లాసా(టిబెట్/చైనా) మధ్య విమాన ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత కుదుపులతో కూడిన మార్గాలలో ఒకటి. ఇది ఆసియాలోనే అత్యంత కుదుపులతో కూడిన మార్గం కూడా. హిమాలయాల ఎత్తైన శిఖరాల మీదుగా సాగే సుమారు 571 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో కఠినమైన పర్వత భూభాగం, అధిక ఎత్తులో వేగంగా మారే గాలుల కారణంగా తరచుగా గణనీయమైన కుదుపులు ఎదురవుతాయి.
ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాలలో అనేక మార్గాలు తీవ్రమైన కుదుపులకు ప్రసిద్ధి చెందాయి.
*దక్షిణ అమెరికా: అర్జెంటీనాలోని మెండోజా నుంచి చిలీ రాజధాని శాంటియాగో వరకు ఉన్న మార్గం అత్యంత కుదుపులతో కూడినదిగా పరిగణించబడుతుంది.
*ఉత్తర అమెరికా: అమెరికాలోని అల్బుకెర్కీ నుండి డెన్వర్ వరకు ఉన్న మార్గం అత్యంత కుదుపులతో కూడినది.
*ఐరోపా: ఫ్రాన్స్‌లోని నైస్ నుంచి స్విట్జర్లాండ్‌లోని జెనీవా వరకు ఉన్న మార్గం
*ఆఫ్రికా(దక్షిణాఫ్రికా): డర్బన్ నుండి జోహన్నెస్‌బర్గ్ వరకు ఉన్న మార్గం.
*ఓషియానియా(న్యూజిలాండ్): క్రైస్ట్‌చర్చ్-వెల్లింగ్టన్ మార్గం అత్యంత కుదుపులతో కూడినవిగా పరిగణించబడతాయి.














Click it and Unblock the Notifications