ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదు, నెక్స్ట్ ఇక - పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం..!!
మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. పార్టీ నేతలకు ఈ మేరకు దిశా నిర్దేశం చేసారు. డీఎస్సీతో సహా పీపీపీ నిర్ణయాల పైన మరింతగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఒక వైపే తమ వాదన ప్రజల్లోకి తీసుకెళ్తోందని.. నాణేనికి రెండో వైపు ప్రజలకు అర్దం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసారు.
అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో కీలక అంశాలను ప్రస్తావించారు. డీఎస్సీలో అక్రమాల పైన పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం దిగి వచ్చి వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీపీపీ నిర్ణయాలపై మండిపడ్డారు.

రాష్ట్రం లోని ప్రజా రవాణా, తాగునీరు, ఆస్పత్రులు, బడుల వంటి నిత్యావసర ప్రజా సేవలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేలా ఈ విధానం ఉందంటూ 'ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్' అనే రీతిలో పరిపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ కంపెనీలకు వడ్డీలు, వియాబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట ప్రభుత్వ ధనాన్ని కట్టబెడుతూ, ప్రజలపై యూజర్ ఛార్జీల భారం మోపడం దారుణమని జగన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును సైతం కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ముస్తఫా, విరూపాక్షి, దొంగ సాక్ష్యాలతో చింతాడ రవిలను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈ అణచివేత ధోరణిపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. మరోవైపు చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్‌పేపర్లు అబద్ధాల 'ఎల్లో పేపర్లు' అని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఏ వర్గమూ ఈ పాలనతో సంతోషంగా లేరని, సున్నా వడ్డీ రద్దుతో మహిళలు తీవ్రంగా నష్టపోయారని జగన్ పేర్కొన్నారు. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాల పైన పక్కా ఆధారాలు.. సాక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్లి.. ప్రభుత్వం పైన పోరాటానికి సమాయత్తం కావాలని జగన్ స్పష్టం చేసారు.














Click it and Unblock the Notifications