దూసుకొస్తున్న అల్పపీడనం, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
ఏపీలో వాతావరణం పై కీలక అప్డేట్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దూసుకొ స్తోంది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తం చేసారు. దీనికి సంబంధించి పలు జిల్లాల యంత్రాంగానికి తాజా అంచనాలను వెల్లడించారు.
ఏపీలో వర్షాల పై విపత్తుల నిర్వహణ శాఖ కీలక సూచనలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అవకాశముంది. అలాగే గురు, శుక్రవారాల్లో వర్షాలతో పాటు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదుగాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
కాగా.. రేపు (గురువారం) నుంచి గురు, శక్రవారాల్లో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అలాగే వర్షం సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోనూ వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిస్తాయని తెలిపారు. ఇక... శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. వర్షం సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. దీంతో.. లోతట్టు ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.













Click it and Unblock the Notifications