Ramayana: రామాయణ చిత్రంలో బిగ్ ట్విస్ట్: ఒకే నటుడు, ఏడు క్యారెక్టర్లు!

Ramayana: ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' నుంచి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పౌరానిక ఇతిహాసంలో ప్రముఖ నటుడు చేతన హన్స్‌రాజ్ ఏకంగా ఏడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు వెల్లడైంది. సాధారణంగా ఒకే చిత్రంలో ఒకే ఇన్ని వేర్వేరు క్యారెక్టర్లు పోషించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులు, అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది.

సూర్య మూవీ.. 'విశ్వనాథ్ & సన్స్’ మొదటి రివ్యూ
సూర్య మూవీ.. 'విశ్వనాథ్ & సన్స్’ మొదటి రివ్యూ

ఈ చిత్రంలో చేతన్ హన్స్‌రాజ్ పోషిస్తున్న ప్రధాన పాత్రల్లో 'రాజా మాలి' ఒకటి. యశ్ పోషించిన రావణుడి తాత అయిన రాజా మాలి పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికీ పూర్తయినట్లు చేతన్ వెల్లడించారు. ఈ నటుడు ఇప్పటికే యశ్‌తో తన సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. చాలా పవర్‌ఫుల్‌గా వచ్చాయని.. కథలో రాజా మాలి పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన వెల్లడించారు.

Ramayana Movie Actor Chetan Hansraj to Play 7 Roles using motion-capture technology including Raja Mali Character


రాజా మాలి పాత్ర చిత్రీకరణ పూర్తయిన అనంతరం చిత్ర బృందం చేతన్ హన్స్‌రాజ్‌కు మరో ఆరు అదనపు పాత్రలను ఆఫర్ చేసిందట. ఈ 6 పాత్రలను అత్యాధునిక మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ తెరకెక్కించనున్నారట. ఈ ఆరు పాత్రలలో ఒకటి రావణుడి సోదరులలో ఒకరి పాత్ర కాగా.. మరొకటి శక్తివంతమైన రాక్షసుడి పాత్ర అని తెలుస్తోంది. మిగిలిన పాత్రల వివరాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచారు.

Mirzapur The Movie: మిర్జాపూర్: ది మూవీ ట్రైలర్ రిలీజ్..
Mirzapur The Movie: మిర్జాపూర్: ది మూవీ ట్రైలర్ రిలీజ్..

ఒకే సినిమాలో చేతన్ హన్స్‌రాజ్ ఇప్పుడు ఏడు పాత్రలను పోషిస్తున్నానని వెల్లడించడంతో.. రామాయణలో ఆయన పాత్ర మొదట్లో ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా స్పష్టమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఇతిహాసం గురించి నిర్మాతలు మరిన్ని వివరాలు వెల్లడించే వరకు, ఆయన మిగిలిన పాత్రల గుర్తింపు ఒక రహస్యంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. మిగిలిన రహస్య పాత్రల వివరాల కోసం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+