ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి..? జర్నలిస్ట్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ క్లారిటీ..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా ఓ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖన్ జైల్లోనే మరణించి ఉండొచ్చని పాకిస్థాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే ఆయన వాదనపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే మృతి చెంది ఉండొచ్చని ముగ్గురు సీనియర్ పాకిస్థాన్ సైనిక అధికారులు తనకు చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కలిసి ఇమ్రాన్ ఖాన్ ను దాచిపెడుతున్నారని అమెరికాలో ఉంటున్న జర్నలిస్టు వజాహత్ సయీద్ ఖాన్ తెలిపారు. అయితే ఈ సమాచారాన్ని తాను వ్యక్తిగతంగా దర్యాప్తు చేయలేదని తాను కొన్ని ఛానెల్స్ నుంచి మాత్రమే ఈ సమాచారం తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయనపై పలు కేసుల విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వడం లేదని పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ పలుమార్లు ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఖాన్ కు సరైన వైద్యం అందించడం లేదని స్పష్టం చేస్తోంది.

మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వదంతులపై పాకిస్థాన్ సైన్యం కీలక ప్రకటన జారీ చేసింది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగమైన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, అడియాలా జైలులో ఖైదీగా ఉన్నారని తెలిపింది. ఖాన్ ఇక తమతో లేరని సీనియర్ పాకిస్థానీ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ పేర్కొన్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారా..? లేక బతికున్నాడా..? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications