రేపే శ్రావణం ప్రారంభం: ముఖ్యమైన రోజులు- చేయాల్సిన పనులు, నియమాలు..!!

హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంకు ఎంతో ప్రత్యేకత ఉంది. శుభకార్యాలకు ఈ మాసం ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుడిని ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు. ఈ మాసం లో ముఖ్యమైన రోజులు.. చేయాల్సిన పూజలు.. చేయాల్సిన పనులు, నియమాల పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు.

శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణా నక్షత్రమే కావడం ఈ మాసానికి మరింత ప్రాముఖ్యత ను తెచ్చిపెడుతుంది. శుభ ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు, పూజలకు ప్రసిద్ధి గాంచింది శ్రావణ మాసం. ఈ నెల రోజుల్లో శుభకార్యాలు, వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. రేపు(గురు వారం ) నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ మాసం కొనసాగుతుంది.

Shravana Masam Significance Importance Festivals and Rituals here the full details

కాగా.. ఆగస్టు 15, 16, 21, 22, 23, 26, 27, 28, 30 తేదీలతో పాటు సెప్టెంబరు 3, 4, 5 తేదీల్లో కూడా వివాహ ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. కాగా.. శ్రావణ మాసం ముగిసిన తర్వాత భాద్రపదం శూన్యమాసంగా రావడం, అనంతరం ఆశ్వీయుజ మాసంలో శుక్ర మౌఢ్యం ఉండటంతో కొంతకాలం వివాహ ముహూర్తాలు అందుబాటులో ఉండవని చెబుతున్నారు.

కాగా, అక్టోబరు 29 వరకు శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. దీంతో, శ్రావణంలోనే నిర్వహించేలా పలువురు ఆసక్తి చూపుతున్నారు. శ్రావణ మంగళవారం, శుక్రవారం నాడు గౌరీ దేవిని, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం చాలా విశేషమైనది. ఆ రోజు గణపతి పూజ చేసి, వరలక్ష్మీ దేవిని ఆరాధించి, వ్రత కథ చదువుకుని, ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఈ సారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని పండితులు ఇప్పటికే ముహూర్తంగా నిర్ణయించారు.ఈ నెలలో దాదాపు 5 వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని విశ్లేషకుల అంచనా. అంతేగాకుండా రాఖీ పౌర్ణమి ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+