ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త పెన్షన్ల జమ వాయిదా - మళ్లీ ఎప్పుడంటే..!?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు(గురువారం) పంపిణీ చేస్తామని ప్రకటన చేసిన ఇందిరమ్మ చీరలు.. కొత్త పెన్షన్ల జమ వాయిదా వేసింది. ఈ రోజు కోసం వేచి చూస్తున్న లబ్ది దారులకు నిరాశ మిగిలింది. చివరి నిమిషంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ రోజు నుంచి ఇందిరమ్మ భీమా పథకం మాత్రం ప్రారంభం కానుంది. కాగా.. పెన్షన్ల జమ.. ఇందిరమ్మ చీరెల పంపిణీ కోసం ప్రభుత్వం కొత్త ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
చేయూత పెన్షన్లు.. ఇందిరమ్మ చీరెలు ఈ రోజు అందుతాయని ఆశతో ఉన్న లబ్ది దారులకు బిగ్ అప్డేట్. ప్రభుత్వం వీటి అమలు వాయిదా వేసింది. ఈ రోజు ఇందిరా గాంధీ జయంతి రోజున వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కొత్త పెన్షన్ల కోసం మంజూరు పత్రాలను ఇప్పటికే పంపిణీ చేసారు. ఈ రోజు జమ చేస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఈ రోజు వీటిని పంపిణీ చేయటం లేదని ప్రకటించింది. ఇందిరమ్మ చీరలు.. పెన్షన్ల జమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ రోజున సిద్దిపేటలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా ఈ పంపిణీ కార్యక్రమంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.

ఈ నెల 26న పంపిణీ ముహూర్తం
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26 నుంచి ఇందిరమ్మ చీరలు, చేయూత పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కొత్తగా మంజూరైన లబ్ధిదారులతో కలిపి మొత్తం 4,63,857 మందికి చేయూత పింఛన్లను అందించనున్నారు. వృద్ధులు, వితంతు వులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు ఈ పెన్షన్లు ఆర్థికంగా తోడ్పాటు అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, ముందుగా ప్రకటించిన తేదీ మారడంతో లబ్ధి దారుల్లో కొంత నిరీక్షణ నెలకొన్నప్పటికీ, నవంబర్ 26 నుంచి పంపిణీ చేస్తామనే ప్రభుత్వ తాజా ప్రకటనతో మహిళలు, పెన్షన్‌దారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications
