కుప్పకూలిన ఇనుప వంతెన.. కాలువలో వేలాడుతూ మంటల్లో చిక్కుకున్న రెండు లారీలు!

పంజాబ్‌లోని పాటియాలా-సంగ్రూర్ రహదారిపై గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. భాక్రా కాలువపై నిర్మించిన ఓ ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న రెండు భారీ లారీలు వంతెనతో పాటు కిందకు పడి కాలువలో వేలాడుతున్నాయి. ప్రమాద తీవ్రతకు ఆ లారీల్లో మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

దైవ భూమిలో విషాయం.. లోయలో పడిన బస్సు, 8 మంది మృతి
దైవ భూమిలో విషాయం.. లోయలో పడిన బస్సు, 8 మంది మృతి

అప్రమత్తమైన యంత్రాంగం.. డ్రైవర్లు సురక్షితం
గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగానే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో వేలాడుతున్న లారీల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ రెండు లారీల డ్రైవర్లను సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Iron Bridge Collapse on Patiala-Sangrur Highway Two Trucks Hang Over Canal and Catch Fire Full Details

నిర్మాణ నాణ్యతపై అనుమానాలు
కూలిపోయిన వంతెన పైభాగం నుంచి భాక్రా కాలువ నీరు ప్రవహిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా పక్కనే ఉన్న మరో వంతెన ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.

IND vs NZ: వెల్లింగ్టన్‌లో బుమ్రా నిప్పులు.. తొలి సెషన్‌లోనే కివీస్‌కు భారత్ షాక్!
IND vs NZ: వెల్లింగ్టన్‌లో బుమ్రా నిప్పులు.. తొలి సెషన్‌లోనే కివీస్‌కు భారత్ షాక్!

కాగా ఈ జాతీయ రహదారి, వంతెనను సుమారు 2016లో నిర్మించారు. గతంలోనే ఈ వంతెనపై పగుళ్లు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనకి తోడు లారీల్లో ఓవర్‌లోడ్ ఉండటం వల్లే వంతెన బరువు తట్టుకోలేక కూలిపోయిందా? లేక నిర్మాణ లోపమా? అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. పదేళ్లు కూడా నిండక ముందే వంతెన కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+