విజయ్ "ఒక్కరోజు ముఖ్యమంత్రి".. ఒక్క సంతకంతో సంచలనం..!
తమిళనాడు నూతన సీఎంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ మే 10 ఆదివారం రోజున ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 108 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కంచుకోటల్లాంటి డీఎంకే, అన్నాడీఎంకే నియోజకవర్గాల్ని బద్దలు కొట్టి విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు.
వీరిలో ఆటో డ్రైవర్, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు లాంటి సాధారణ వ్యక్తులు కూడా విజయ్ సునామీలో దిగ్విజయం సాధించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నియోజకవర్గం అయిన కొలత్తూర్ లో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడమే విజయ్ వేవ్ కు నిదర్శనం. వీఎస్ బాబు అనే అభ్యర్థి డీఎంకే అధినేత స్టాలిన్ ను ఓడించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అని చెప్పొచ్చు. విజయ్ సినిమాల్లో కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వాళ్లంతా విజయ్ సీఎం కావాలని కోరుకున్నారు. కాబట్టే ఈ విజయం సాధ్యమైంది. తన అభిమానుల్ని పోలింగ్ కేంద్రంలోకి తీసుకొచ్చి ఓటు వేయించడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. దాని ఫలితమే పార్టీ పెట్టిన రెండేళ్లకే విజయ్ సీఎం కావడం.

అయితే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా పూర్తికాక ముందే విజయ్ మరో సునామీ సృష్టించారు. సీఎంఓ తమిళనాడు ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు ఇదివరకు 4 లక్షల మంది మాత్రమే సబ్ స్క్రైబర్లు ఉండేవారు. ఇప్పుడు విజయ్ సీఎం అయిన 24 గంటల్లోనే ఆ మార్క్ 12 లక్షలకు చేరింది. గంట గంటకూ యూజర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీన్ని బట్టి విజయ్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఆయన్ను ఫాలో అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ஒரே ஒரு கையெழுத்து... ஒரு கோடி எதிர்பார்ப்பு! 🖊️✨
— 𝐃𝐚𝐲𝐚𝐥 (@e_dayal) May 11, 2026
முதல்வர் அலுவலகத்தின் இன்ஸ்டாகிராம் பக்கத்தில் தெரிந்த அந்த எழுச்சி, தமிழக வெற்றிக் கழகத்தின் மாபெரும் வெற்றிக்குச் சாட்சி.#தமிழகவெற்றிக்கழகம் #TVK #CMVijay #தமிழகமுதல்வர் pic.twitter.com/T4tCx9RFFS
ఇక తమిళనాడులో 17వ శాసనసభ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఇక మే 12 న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే మే 13న సీఎం విజయ్.. శాసనసభలో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications